Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కండిషనర్ను వెంట్రుకల కుదుళ్లకు కాకుండా కురులకు మాత్రమే పట్టించాలి. కుదుళ్ళకు కండిషనర్ పట్టిస్తే అక్కడ నూనె తయారై వెంట్రుకలు జిడ్డుగా మారడంతోపాటు చుండ్రు సమస్య కూడా తలెత్తుతుంది. దాంతో దురద, జుట్టు రాలే సమస్యలు మొదలవుతాయి.
* రంగు వేసిన లేదా పొడి వెంట్రుకలైతే కండిషనర్ను నేరుగా మాడుకే పట్టించటం మేలు. నీటి తాకిడికి జుట్టుకు వేసిన రంగు తొలగిపోకుండా ఉండాలన్నా, రంగు వెంట్రుకలకు అంటుకుని ఉండాలన్నా కండిషనర్ను కుదుళ్లకే పట్టించాలి.
* వెంట్రుకలు పల్చగా, బలహీనంగా ఉంటే షాంపూ చేయటానికి ముందే కండిషనర్ అప్లై చేయాలి. ఇలా చేస్తే షాంపూ చేసిన తర్వాత కూడా కొంత కండిషనర్ వెంట్రుకల మీద నిలిచి ఉంటుంది. దాంతో జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది. వెంట్రుకలు చిట్లకుండా ఉండటానికి ఉత్తమమైన మార్గం కూడా ఇదే!
* షాంపూ చేసినప్పుడే కండిషనర్ అప్లై చేయాలనే రూలేం లేదు. జుట్టు కాంతులీనాలన్నా, మృదువుగా కనిపించాలన్నా షాంపూ చేయకుండా నేరుగా కండిషనర్ అప్లై చేయవచ్చు. తరచుగా షాంపూ ఉపయోగించటం వల్ల వెంట్రుకలు బలహీనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమను కున్నప్పుడు నేరుగా కండిషనర్‌నే ఉపయోగించవచ్చు.
* కండిషనర్ కొనేటప్పుడు దాని మీదున్న లేబుల్ తప్పకుండా చదవాలి. దాన్లో సిలికాన్ ఉపయోగించారో లేదో తెలుసుకోవాలి. సిలికాన్ లేని కండిషనర్‌నే కొనాలి. సిలికాన్ వల్ల వెంట్రుకల చివర్లు చిట్లుతాయి. అలాగే వెంట్రుకల సహజసిద్ధ నూనెలను సిలికాన్ తొలగిస్తుంది.
* సాధారణంగా షాంపూ చేసిన వెంటనే కండిషనర్ అప్లై చేస్తూ ఉంటాం. కానీ ఇలా చేయటం వల్ల తిరిగి వెంట్రుకలను కడిగినప్పుడు కండిషనర్ మొత్తం తొలగిపోతుంది. ఇలా కాకుండా కండిషనర్ను వెంట్రుకలు పీల్చుకోవాలంటే తలస్నానం చేసిన తర్వాత టవల్‌తో వెంట్రుకల తడిని తుడుచుకున్నాక కండిషనర్ అప్లై చేయాలి.