Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలో అసమానతలు అత్యధికంగా ఉన్న దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ఈ దేశంలోని అతి పెద్ద నగరమైన సావో పాలోలో ఈ తేడాలు మరీ స్పష్టంగా కనిపిస్తాయి. దాదాపు రెండు కోట్ల జనాభా ఉన్న ఈ నగరంలో పది లక్షల మందికి ఇళ్లు లేవు. ఇండ్ల కొరత ప్రధానంగా మహిళలను తీవ్రంగా వేధిస్తోంది. అయితే, ఈ నగర శివార్లలో ఆక్రమిత భూభాగంలో వెలిసిన కొత్త కాలనీవాసులు స్త్రీవాద సంఘాలను ఏర్పాటు చేసుకుని ఈ సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. ఇంటి వసతి కోసం చేసే పోరాటం మాత్రమే కాదు. వాళ్లు సమాన హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇక్కడ 90 శాతం నిర్ణయాలు మహిళలే తీసుకుంటారు. రియోలోని కౌన్సెలర్ మారియెల్లె ఫ్రాంకో హత్య ప్రభావం ఇక్కడి ప్రజలపై పడింది. ఇక్కడ మహిళలకు కనీస హక్కులుండేవి కాదు ఒకప్పుడు. ఇప్పుడు వారు ముందుకొచ్చి మాట్లాడగలుగుతున్నారు. అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఒక అంశం కోసం నిలబడినా, ఓ మంచి కోసం పోరాడినా హత్య చేసే సంస్కృతి ఇక్కడ ఉంది. అయినా మహిళలు పోరాటాన్ని వదలడం లేదు. అందరు సంఘటితం అవుతున్నారు. ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరు అన్నట్టుగా పనిచేస్తున్నారు. గృహ హింసను అస్సలు ఉపేక్షించరు. అలాంటిదేమైనా జరిగితే సంఘంలో చర్చించి బాధ్యులను బహిష్కరిస్తారు. ఇక్కడి పురుషులందరూ స్త్రీవాదులు కాకపోయినా మద్దతుదారులే. కొత్త తరానికి ఇదొక పాఠం. వాళ్ళు దీన్ని వృ త్తిపరమైన ఆశాభావం అంటున్నారు. కొత్త తరహా భవితకు ఇదొక గొప్ప అవకాశం.