Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొందరగా మర్చిపోతున్నారా? ఏది సరిగ్గా గుర్తు ఉండటం లేదా? అయితే మీ మెదడకు వ్యాయామం అవసరరం. మెదడుకు వ్యాయామం అనగానే చాలామంది క్రాస్‌వర్డ్ పజిల్స్ మాత్రమే అనుకుంటుంటారు. అంతేకాదు చాక్లెట్సు తినడం వల్ల, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, యోగా చేస్తే, వీడియోగేమ్స్ ఆడితే మీ మెదడు సామర్థ్యం పెరుగుతుందని గతంలో చాలా అధ్యయనాలు తెలిపాయి. కానీ న్యూయార్క్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఓ కొత్త సూత్రం చెబుతోంది. మ్యూజికల్ ఇన్స్ట్రూమెంట్ నేర్చుకోవడం, లేదంటే కొత్త భాషను నేర్చుకోవడం వల్ల మెదడు మరింత చురుగ్గా పని చేస్తదంటోంది. విదేశీ భాషలు నేర్చుకోవడం వల్ల మెదడు సామర్థ్యం పెరుగుతుందని 2016లో జరిగిన మరో అధ్యయనం కూడా తేల్చి చెప్పింది.
అయితే ఒక పనిని సాధారణ వ్యక్తులు చేసేతీరుకు, రెండు మూడు భాషలు వచ్చినవారు, సంగీతకారులు చేసే తీరుకు చాలా తేడా ఉంటుందట. అలాగే అన్ని విషయాలను గుర్తుంచుకోవడంలో మిగిలినవారికంటే భిన్నంగా ఉంటారట. ఫోన్‌నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం, ఏవైనా సూచనలను మరిచిపోకుండా ఉండటం, మెంటల్ మ్యాథ్స్వంటివి అద్భుతంగా చేస్తారట. రెండు మూడు భాషలు తెలియడం వల్ల మెదడులో ఉన్న భాగాలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. అవి ఎంత క్రియాశీలకంగా ఉంటే మెదడు అంత శక్తివంతంగా పనిచేస్తుందట. ఇంకెందుకాలస్యం.. మరో భాష నేర్చుకోవడమో, సంగీతం, సంగీత వాయిద్యం నేర్చుకోవడమే వెంటనే మొదలుపెట్టండి.