Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తగా హాస్టల్లో చేరే చిన్నారులకు తల్లిదండ్రులు ఎన్నో విషయాలను నేర్పించాల్సి వస్తుంది. అంతవరకూ గారాబంగా పెరిగినవాళ్లు.. ఒక్కసారిగా తమ పనులు తాము చేసుకోలేని గందరగోళంలో పడతారు. ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే కింది చిట్కాలను పాటించాలి.
- కష్టపడితేనే ఫలితం అనే విషయాన్ని పిల్లలకు అర్థం చేయించాలి. వాళ్లు తరచూ ఏదైనా వస్తువు కొనివ్వాలని కోరుతున్నారనుకోండి.. అందుకు ఇంటికి ఏం చేస్తారో అడగండి. తోటపని, దుస్తులు శుభ్రం చేయడం.. ఇలా ఏదైనా సరే! అప్పుడే చిన్నారులకు డబ్బు విలువ తెలుస్తుంది. పైగా వ్యక్తిగా తమ శ్రమ విలువనూ అర్థం చేసుకుంటారు.
- స్కూలు నుంచి ఇంటికి రాగానే పుస్తకాలు బ్యాగు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు చాలామంది పిల్లలు. అలాకాకుండా లంచ్ బాక్స్‌లు, సాక్స్‌లు, దుస్తులు.. అన్నీ వారినే సరిగ్గా సర్దుకోమని చెప్పాలి. తమ దుస్తులు మడతపెట్టడం వంటివి చిన్నతనం నుంచే అలవాటు చేయాలి.
- వారానికోసారి పుస్తకాల అల్మారా సర్దడం, రెండు మూడు మొక్కల బాధ్యత తీసుకుని రోజూ నీళ్లు పోయడం, పూలు కోయడం వంటివి చేసేలా చూడండి. ఇవి అనుకున్న సమయానికి పనులు పూర్తిచేయడాన్ని పిల్లలకు నేర్పిస్తాయి.