Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్టుచీరల మన్నిక కోసం ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కొందరికి పట్టుచీరలను ఎలా భద్రపరచాలో తెలియదు. అలాంటి వారు మీరైతే ఈ కథనాన్ని చదవితే మంచిది.
- ఖరీదైన పట్టుచీరెలను డ్రైక్లీనింగ్ చేయించాలి.
- పట్టుచీరను భద్రపరిచేటప్పుడు ఆ చీరలో వేపాకును ఉంచడం వల్ల పురుగులు చేరడం, చిల్లులు పడటం వంటి జరుగవు.
- పట్టుచీరను తడిపేటప్పుడు నీళ్ళల్లో కాస్త కుంకుడు రసం కలపడం మంచిది.
- పట్టుచీరను విప్పిన వెంటనే మడత పెట్టకూడదు. కొంతసేపు గాలికి ఆరనిచ్చి ఆ తర్వాత మడతపెట్టి భద్రపరచాలి.
- పట్టుచీరలకు జరీ ఎక్కువగా ఉన్నప్పుడు చీరను తిరగవేసి ఆరేయ్యాలి. అలా చేస్తే జరీ ఊడకుండా ఉంటుంది.
- మడత పెట్టేటప్పుడు కూడా జరీ లోపల పెట్టి మడత వేయాలి.
- నీళ్ళలో తడిపిన పట్టు చీరను ఎండలో ఆరేవేయకూడదు. అలా ఆరవేస్తే పట్టుచీర మీద మరో చీరను ఆరెయ్యడం మంచిది.
- ఇస్త్రీ చేసేటప్పుడు కూడా మరో కాటన్ బట్టను వేసి చేయాలి.
- పట్టుచీరలను భద్రపరిచిన అరలో కలరా ఉండలను వేయాలి.