Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రక తి వనరుల్ని ఎంత పొదుపుగా వాడాలో చిన్నతనం నుంచీ అలవాటు చేస్తే.. పెద్దయ్యాకా కొనసాగిస్తారు. నీటి వ థాని అరికట్టే దిశగా వారికి అవగాహన కల్పించండి. ఉదాహరణకి వాళ్లు పళ్లు తోముకునేటప్పుడు కుళాయిని అలాగే వదిలేసి తోముకుంటుంటే అలా చేయొద్దని వివరించండి. రెండుమూడు రోజులు మీరు పక్కనుండి చెబితే.. అర్థంచేసుకుంటారు. మనచుట్టూ ఉండే పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడండి. చిన్నారులకూ ఇదే నేర్పండి. స్కూల్, ఇల్లు, పార్క్... ఇలా ఎక్కడికి వెళ్లినా శుభ్రత పాటించేలా చూడండి. ముఖ్యంగా వాళ్లు తినే చాక్లెట్, బిస్కెట్ ప్యాకెట్ల కాగితాలను ఎక్కడపడితే అక్కడ కాకుండా చెత్తడబ్బాలో పారేసేలా ప్రోత్సహించండి. నిర్లక్ష్యం చేసినా.. మీరు దగ్గరుండి చెత్త డబ్బాలో వేయించండి. మీ పెరటిలో కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను పెంచండి. వాటి సంరక్షణా బాధ్యతల్లో పిల్లల్ని భాగస్వాములను చేయండి. ఇంట్లో వాడేసిన కూరగాయల ముక్కలూ, పండ్ల తొక్కలు ... ఇలా వ్యర్థాలతో సహజ ఎరువులను వారితో తయారు చేయించండి. వాటిని మొక్కలకు ఎరువుగా వేయమనండి. ప్రతి వారం మీతోపాటు వారిని కూరగాయల మార్కెట్కు తీసుకువెళ్లి అక్కడి తాజా కాయగూరలనూ, పండ్లనూ చూపించండి. వీలైతే అవి ఎలా పండుతున్నాయో వారికి చూపించండి. వాళ్లకో అవగాహన వస్తుంది.