Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంట చేసేటప్పుడు చేతులు కాలడం, ఇల్లు సర్దేటప్పుడు చిన్నచిన్న గాయలు కావడం, వాంతులు, విరేచనలు, చర్మ సమస్యలు, మొటిమలు, గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు వంటివి సర్వసాధారణం. గాయాలకు భయపడి ప్రథమ చికిత్స కోసం హాస్పటల్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రథమ చికిత్సకు అవసరమైన ఔషధాలు మీ ఇంట్లోనే ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో చూద్దామా..!
కలబంద గుజ్జు : కాలిన గాయాలకు, పగిలిన కాళ్లకు కలబంద గుజ్జు మంచి ఔషధంలా పని చేస్తుంది. గాయమైన ప్రదేశంలో కలబంద గుజ్జును నేరుగా రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. గాయం మానడంతో పాటు, గాయం తాలుకు మచ్చలు, గీతలు మయం అవుతాయి.
యాపిల్ సైడర్ వెనిగర్ : యాపిల్ సైడర్ వెనిగర్ సహజ సిద్ధమైన ఔషధగుణాలను కలిగి ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో మ్యాజికల్ లిక్విడ్‌గా పని చేస్తుంది. కడుపు ఉబ్బరం, మొటిమల సమస్య, చుండ్రు సమస్యను దూరం చేయడంలో యాపిల్ సైడర్ వెనిగర్ బాగా ఉపయోగపడుతుంది.
బేకింగ్ సోడా : కాలిన గాయాలను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా కలిపిన నీళ్లతో కడిగితే గాయం త్వరగా తగ్గడంతో పాటు మంట కూడా మయం అవుతుంది. బేకింగ్ సోడా నీళ్లతో నోటిని పుక్కిలించాలి. ఈ నీళ్లు మౌత్ ఫ్రెష్నర్గా ఉపయోగపడతాయి.
తేనె : ఇది గొంతు నొప్పి, దగ్గు సమస్యను దూరంలో చేయడంలో మంచి యాంటీ ఆక్సిడెంట్. కాబట్టి రోజు ఒక చెంచా తేనెను తాగితే మంచి ఫలితం ఉంటుంది.
అల్లం : కడుపు ఉబ్బరం, కీళ్ల నొప్పులు, వాతులు, వికారం ఉన్నావారు చిన్న అల్లం ముక్కను ఒక గ్లాసు నీటిలో మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
టీ బ్యాగ్స్ : వాపులు, ఒళ్లు నొప్పులు, దురద నుంచి ఉపశమనం కలిగించడంలో టీ బ్యాగుల పాత్ర కీలకం. టీ బ్యాగును వేడి నీటిలో ముంచి వాపులు, దురద ఉన్న ప్రదేశంలో పెట్టడం వల్ల గాయాలు త్వరగా మానతాయి.