Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చర్మ సౌందర్యానికి హెర్బల్ నూనెలు బాగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి, ఆలివ్ నూనెలు చర్మాన్ని మృదువుగా, కోమలంగా ఉంచుతాయి. స్కీన్ లోషన్స్, మాయిశ్చరైజర్, కండీషనర్ వంటివి చర్మానికి తేమను అందిస్తాయి. అయితే వాటిని నేరుగా చర్మానికి రాసుకోవడం వల్ల చర్మ సమస్యలు ఎదురవుతాయి. దాంతో పాటు రసాయనాలు అధికంగా ఉండే మాయిశ్చరైజర్లు, కండీషనర్లను చర్మ గ్రంథులు త్వరగా పీల్చుకోవు.
హెర్బల్ నూనెలు (కొబ్బరి, ఊసిరి, ఆముదం, ఆలివ్ నూనెలు) కేవలం చర్మానికే కాదు. వెంట్రుకల పెరుగుదలకు కూడా ఎంతగానో తోడ్పడతాయి. ఎందుకంటే వీటిలో ఫ్యాటీ ఆమ్లాలు, లినోలిక్ ఆమ్లాలు, విటమిన్ 'ఇ' సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ పోషణకు ఎంతగానో ఉపయోగపడతాయి. చర్మం బిగుతుగా, నిర్జీవంగా ఉన్న వాళ్లు హెర్బల్ నూనెలను వాడితే మంచి ఫలితం ఉంటుంది. అయితే వీటిని మాయిశ్చరైజర్లో కలుపుకొని చర్మానికి రాసుకుంటే చర్మ గ్రంథులు త్వరగా పీల్చుకుంటాయి.