Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేకప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నచిన్న పొరపాట్ల వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు, చర్మం ముడతలు పడటం వంటి సమస్యలు ఎదురవుతాయి. వాటి నుంచి బయట పడాలంటే కింది సూచనలు పాటించాలి.
- ఎంతో ఖరీదు పెట్టి కొన్నాం కాబట్టి అయిపోయేవరకూ అలంకరణ వస్తువులు వాడుకోవాలని అనుకోవద్దు. ఎందుకంటే మస్కారా, కాటుక వంటివి ఆరునెలలే వాడాలి. అంతకు మించి వాడకపోవడం మంచిది. ఎంత రాత్రి అయినా సరే మేకప్ తొలగించుకోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. లేదంటే మొటిమలు, మచ్చల సమస్యలు ఎదురవుతాయి.
- కనుబొమ్మల్ని తీర్చిదిద్దుకునే సమయం లేనప్పుడు చాలాసార్లు ప్లక్కర్ లాంటి చిన్న పరికరంతో లాగేసే ప్రయత్నం చేస్తుంటారు. ఒకవేళ కనుబొమ్మలు పల్చగా ఉన్నట్టయితే కొద్దిగా తీసేసినా అవి పల్చగా కనిపిస్తాయి. దాంతో ముఖం వయసు పైబడినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి వీటికోసం ప్రత్యేకంగా ఉండే జెల్‌ని రాసుకోవాలి. దాంతో కనుబొమ్మలు కాస్త దట్టంగా, ఒక ఆక తిలో కనిపిస్తాయి.
- కండ్లు ఎర్రగా మారినప్పుడు కంట్లో ఏదో పడి ఉంటుందని అనుకుంటాం. శుభ్రం చేసుకుని వదిలేస్తాం. కానీ అన్నిసార్లు దుమ్మూధూళే కారణం కాదు. మనం కండ్ల అలంకరణకు ఉపయోగించే బ్రష్‌లని శుభ్రం చేయకపోవడం వల్ల కూడా కంటి సమస్యలు వస్తాయి. వారానికి ఒకసారైనా షాంపూతో కడగాలి. లేకపోతే కండ్ల దురదా, ఇన్ఫెక్షన్లు రావడానికి కారణం అవుతాయి.
- మనం చేతివేళ్లతో కీబోర్డుని ఉపయోగిస్తాం, అంట్లు తోముతాం... మరెన్నో పనులు చేస్తాం. కానీ ఆ చేతుల్నే ముఖంపై పెట్టేస్తాం. వేళ్లపై ఉన్న క్రిములు ముఖంలోకి చేరి చర్మరంధ్రాలను మూసేస్తాయి. దాంతో మొటిమలు వస్తాయి. కాబట్టి ముఖంపై పదేపదే చేతులు పెట్టుకునే అలవాటుని మానుకోవడం మంచిది. మేకప్ వేసుకునే ముందు చేతుల్ని
శుభ్రంగా కడుక్కోవాలి.