Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇతర దేశాలకు, కొత్త ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లేటప్పుడు అమ్మాయిలు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే ...
్ల వెళ్లే ప్రదేశం గురించి ఇంటర్నెట్లో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. లాడ్జింగ్ రేట్ల గురించి, గతంలో ఆ ప్రదేశాలకు వెళ్లిన వ్యక్తుల అనుభవాల గురించి తెలుసుకోవాలి. అలాగే వెళ్లే చోట ఎలాంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ అందుబాటులో ఉంది? కారు అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఉందా? రాత్రివేళలు అక్కడ సురక్షితమేనా? వంటివి కనుక్కోవాలి. ట్రావెల్‌కు ముందర ఒకసారి వైద్యుని సంప్రదించడం, వాక్సినేషన్ ఏదైనా అవసరం ఉంటే తీసుకోవాలి. అడ్వంచర్ స్పోర్ట్స్ లాంటి వాటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అడిగి తెలుసుకోవాలి.
్ల ముఖ్యమైన వస్తువులు, సర్టిఫికేట్లు, నగలు వంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చిన్న బ్యాగులో పాస్‌పోర్టు, కెమెరా, మందులు, నగలు, క్రెడిట్‌కార్డులు, స్మార్ట్‌ఫోన్, ఇంకేవైనా విలువైన టెక్నాలజీని పెట్టుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ వీటిని బ్యాగ్ లో పెట్టుకోవద్దు. ముఖ్యంగా విలువైన వస్తువులను చెక్డ్ లగేజ్‌లో అసలు పెట్టుకోవద్దు.
్ల బయటకు వెళ్లేటప్పుడు అవసరమున్న వాటినే తీసుకెళ్లాలి. మిగతావాటిని భద్రంగా బ్యాగులో ఉంచి లాక్ చేయాలి. మీ దగ్గర ఉన్న డెబిట్కార్డులన్నింటినీ బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే డబ్బును కూడా పరిమితంగా తీసుకెళ్లాలి. మిగతా వాటిని బ్యాగులోనే పెట్టి తాళం వేసి మీరున్న అకామిడేషన్లోనే పెట్టేస్తే మంచిది.
్ల అలాగే కొత్తవారిని వెంటనే నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి. వారు స్నేహంగా ఉంటూనే మిమ్మల్ని మోసగించవచ్చు. మీ దగ్గరున్నవన్ని దోచుకెళ్లవచ్చు. కొన్నిసార్లు హాని కూడా తలపెట్టవచ్చు.
్ల సురక్షితమైన ప్రదేశంలో అకామిడేషన్ తీసుకోవాలి. దానికోసం అవసరమైతే ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడానికి కూడా సంకోచించవద్దు. ట్రావెల్ ఇన్సూరెన్సును తప్పనిసరిగా తీసుకోవాలి. ఏ రోజు ఎక్కడ ఉండేది ప్రోగ్రామ్ వివరాలను స్పష్టంగా కుటుంబ సభ్యులకు ముందుగానే తెలియజేయాలి. ు