Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొడి చర్మం ఉన్న వారికి ఎటువంటి సమస్యలు ఉంటాయో, అలానే జిడ్డు చర్మం ఉన్న వారు కూడా చాలా రకాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. చర్మం నుండి అధిక జిడ్డు స్రవించడం వలన మొటిమల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. వీటి నుండి బయటపడటానికి చాలామంది క్రీములను, మాయిశ్చరైజర్లు, ఇతర సౌందర్య క్రీములను ప్రయత్నిస్తుంటారు. అయితే వీటి వలన మరిన్ని సమస్యలు తలెత్త వచ్చు. కనుక ఎటువంటి దుష్ప్ర భావాలు లేనటువంటి సహజ మార్గాలలో జిడ్డు చర్మం వల్ల ఏర్పడే సమస్యల నుండి బయటపడవచ్చు.
- యాపిల్ జ్యూస్‌లో కొద్దిగా నిమ్మ రసాన్ని కలిపి ముఖానికి రాసు కోండి. అది ఆరిన తరువాత నీటితో కడిగేసుకోండి. ఇది జిడ్డును వదిలించడంతో పాటు మీ ముఖాన్ని అందంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.
- ముఖాన్ని పాలతో కడగటం, మెత్తని దూదితో చర్మం మీద రుద్దుకుని శుభ్రపరుచుకోవడం వల్ల ముఖం మీద ఉన్న అధిక జిడ్డు తొలగిపోతుంది.
- ముఖానికి మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా తేనెని రాసుకుని, ఆరిన తరువాత కడిగేసుకుంటే చక్కని ఫలితాన్ని గమనించవచ్చు.
- ఐస్ ముక్కని నేరుగా కాకుండా ఒక మెత్తటి కాటన్ వస్త్రంలో ఉంచి ముఖం మీద రుద్దడం వలన జిడ్డు సమస్య నుండి బయట పడవచ్చు.
- గుడ్డు తెల్లసొన, ద్రాక్ష పండ్ల రసం, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాసుకోండి. 15 నుండి 20 నిముషాల వరకు ఉంచుకుని ఆరిన తరువాత శుభ్రపరు చుకోండి. నిమ్మ రసం చర్మాన్ని శుభ్రపరు స్తుంది. గుడ్డు తెల్లసొన చర్మాన్ని బిగుతుగా చేస్తుంది అలానే ద్రాక్ష పండ్ల రసం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఇవన్నీ కలిపి ముఖాన్ని ఆకర్షనీయంగా మారుస్తాయి.
- కొబ్బరి పాలు మీ చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేసి మీ చర్మంలో ఉన్న జిడ్డుని తొలగిస్తుంది. తద్వారా మీ చర్మం జిడ్డుగా కనిపించదు.