Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన ఇల్లు.. మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.కాబట్టి మన స్టైల్ కి అనుగు ణంగా ఇంటిని అలంకరించేందుకు చాలా సమయాన్ని తీసుకుంటాం. ఇంటిని ఎల్లప్పుడూ అందంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా ప్రయ త్నిస్తాం. కానీ కొన్నిసార్లు వాతావరణం అందుకు అనుకూలించకపోవచ్చు. వర్షాలు ఇంటి ఇంటీరియల్ డెకరేషన్‌ను పాడుచేస్తుంది. వర్షపు నీరు, బురద మరకలను వదిలించడం చాలా కష్టమవుతుంది. ఈ కాలంలో ఇలాంటి సమస్యల నుండి ఇంటిని శుభ్రపరచడానికి కొన్ని సులభమైన చిట్కాలు మీకోసం...
సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి: గాలి, తేమ వల్ల మీ ఫర్నిచర్లో క్రిములు, బ్యాక్టీరియా ఉత్పత్తి కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అందుకే ఫర్నిచర్‌ను పొడిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈ వర్షాకాలంలో గోడలకు, ఫర్నీచర్‌కు మధ్య సరైన దూరాన్ని ఉంచడం వల్ల తడిగా మారిన ఇంటి గోడలు మీ ఫర్నిచర్ తాలూకా చెక్కను నాశనం చేయకుండా ఉంటుంది.అలాగే చాలా ప్రత్యేకంగా ఉన్న ఫర్నిచర్‌ను తలుపులు, కిటికీల నుంచి దూరంగా ఉంచడం ద్వారా వాటిని కాపాడుకోవచ్చు.
డార్క్ కలర్లు ఉంచండి: ఇంట్లో వాడే కర్టిన్స్ ఈ వర్షాకాలంలో మరింత మురికిగా మారిపోతాయి. వాటిని శుభ్రం చేసి, ఎండ బెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే ఈ కాలంలో లైట్ కలర్ వాటికి బదులు డార్క్ కలర్ కర్టన్లు వాడడం ఉత్తమం. ఇలాంటి డార్క్ కలర్స్‌ను ఉపయోగించడం వల్ల మీ ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దవచ్చు.
ఇంటిలోనికి అనుమతించవద్దు: పాదరక్షలను ఇంటిలోపలికి అనుమతించడం ద్వారా ఎక్కువ స్థాయిలో క్రిములు, ధూళి ఇంట్లోకి చేరిపోతాయి. అందుకే చెప్పులను ఇంటి బయట మాత్రమే ఉంచాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంటిని శుభ్రపరచడానికి మీ ఎనర్జీ ఎక్కువగా వృధా కాదు.
తడి బట్టలను వేరేగా నిల్వ ఉంచండి: రెయిన్ కోట్లు, గొడుగులు వంటి వస్తువులు మిగిలిన బట్టలతో కలిపి ఉంచకూడదు. వీటి కోసం కోసం మీరు కొన్ని హుక్స్ లేదా ఒక రాక్ ఏర్పాటు చేసుకోవాలి.
ముందే శుభ్రపరచుకోవాలి : వర్షాలు రాకముందే మీరు ఉపయోగించే దుప్పట్లను, కర్టెన్లను శుభ్రంగా ఉతికి జాగ్రత్త చేసుకోవాలి. ఈ కాలంలో తేలికపాటి దుప్పట్లు ఉపయోగించడం మంచిది. వీటిని సులభంగా ఉతికి ఆరబెట్టివచ్చు.
ప్రత్యేకమైన ప్రదేశాన్ని కేటాయించాలి : మీ ఇంట్లో వెలుతురు బాగా వస్తూ, ఉపయోగించని గదిని బట్టలు ఆరవేయడానికి ఉపయోగించాలి. ఈ కాలంలో బట్టలు ఉతికిన తర్వాత సరిగా ఆరకపోతే వాసన వస్తాయి. అందుకే ఉతికిన తడి బట్టల నుండి వాసన రాకుండా ఆ గది చుట్టూ కొన్ని నాఫ్తలీన్ గోలీలను ఉంచాలి.
తేమను హరించు పరికరం : వర్షాల కారణంగా ఏర్పడే అధిక తేమ మనకు శత్రువు. అవి కేవలం ఇంట్లో ఉన్న ఫర్నిచర్, ఇతర వస్తువులను నాశనం చేయడమే కాకుండా మనపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. తేమను హరించు పరికరాన్ని ఉపయోగించడం కాస్త ఖర్చుతో కూడుకున్నదే. అయితే ఇది భవిష్యత్తులో మనకు చాలా రకాల సమస్యలు రాకుండా రక్షిస్తుంది.
ఎల్లప్పుడు నిల్వ ఉంచుకోండి : ఈ వర్షాకాలంలో మీరు క్రిములు, ధూళి బారిన పడకుండా ఉండటానికి తరుచుగా మీ ఫ్లోర్స్‌ను శుభ్రం చేసుకోవాలి. అందుకే ఇంట్లో ఎల్లప్పుడూ శుభ్రపరిచే క్లీనర్లను మీ వద్ద నిల్వ ఉంచుకోండి. దీంతో వర్షాకాలంలో సూపర్ మార్కెట్ల చుట్టూ తిరిగే అవస్థ ఉండదు.