Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిఒక్కరి జీవితంలో తమకంటూ ప్రత్యేకమైన స్నేహితులు వుంటారు. కొందరు స్నేహితులు మనకు హాని కలిగించాలని అనుకుంటే.. మరికొందరు కష్టాలనుండి గట్టెక్కించడానికి సహాయపడుతారు. ప్రస్తుతం నిర్వహించిన అధ్యయనాల ప్రకారం... మంచి స్నేహితులను కలిగి వున్నవారు జీవితాంతం వారితో సుఖంగా, సంతోషంగా వుంటారని తేలింది. అంతేకాదు.. వారి ఎంత కష్టపనినైనా కలిసి సులభంగా, తేలికగా, సవాలుగా తీసుకుంటారని నిరూపితమైంది.
మంచి స్నేహితులు మనకు తోడుగా, కష్టకాలలో సహాయపడుతారు. మనల్ని ఎటువంటి ఒత్తిడికి గురిచేయకుండా.. మన ఆత్మగౌరవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతారు. మనకు ఎదురయ్యే కష్టాలను మంచి స్నేహితులు తమ కష్టాలుగా భావించి సమస్యలను ఎదర్కొంటారు. వాటిని భరించడానికి సిద్ధంగా వుంటారు. అదేవిధంగా చెడు స్నేహితులు మంచి స్నేహితులుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. సమస్యలను సవరించాల్సింది పోయి.. ఇంకా కొత్త సమస్యలను తెచ్చిపెడతారు. కష్టకాలాల్లో సహాయం చేయకుండా మానసికంగా క్రుంగదీయడానికి చూస్తారు. ప్రతిక్షణం నిరాశకు గురిచేస్తూ.. ద్రోహం చేస్తుంటారు.
డామినేట్ చేయడం: సాధారణం గా కొంతమంది స్నేహితులు మనతో ప్రేమాభిమానాలు పంచుకుంటున్నట్టు వ్యవహ రిస్తారు. కానీ మనకు కష్టాలు వచ్చినప్పుడు వారు డామినేట్ చేయడం లేదా ఆధిపత్యం చెలాయించడం మొదలు పెడతారు. అలా చేసినవారిని వెంటనే చెడు స్నేహితుల జాబితాలోని మనం చేర్చు కోవచ్చు. అంతేకాదు.. ఏదైనా చిన్న పందెంలోకూడా ఓడిన నలుగురిలో మనల్ని అవమానపరుస్తారు. అటువంటివారిని ఎప్పుడూ నమ్మకూడదు.
అసహనం కలిగించడం: కొంతమంది స్నేహితులు ప్రతిక్షణం కోపం తెప్పించడానికి ప్రయత్నిస్తుంటారు. అంతేకాదు.. మీరు చేసే మంచి పనుల్లో మీ సహనాన్ని భంగం కలిగించి, అసహనం కలిగేలా చేస్తారు. ఇటువంటి వ్యక్తిత్వం కలిగి వున్నవారు ఖచ్చితంగా చెడు స్నేహితుడు అనే భావనను ముద్రించుకోవాలి. ఇటువంటి నలుగురిలో కలిసినప్పుడు తక్కువచేసి మాట్లాడుతారు. అది మనల్ని తీవ్రంగా మానసిక స్థితికి గురయ్యేలా చేస్తుంది. కాబట్టి అసహనం కలిగించేవాళ్లను ఎంత దూరం వుంచితే అంతే మంచిది.
ప్రాధాన్యత ఇవ్వకపోవడం: కొంతమంది స్నేహితులు తమ సమయాన్ని మనతో కేటాయించరు. మనతో మాట్లాడడానికి గాని, మన అభిప్రాయాలు, సమస్యలు అడిగి తెలుసుకోవడానికి గాని ఆసక్తి చూపరు. అంటే.. మనకు ఎటువంటి పరిస్థితుల్లోనూ వారు ప్రాధాన్యతను ఇవ్వరు. అటువంటి స్నేహితులు వారికి అవసరమున్నప్పుడే మాట్లాడి తమ అవసరాన్ని తీర్చుకుని వెళ్లిపోతారు. కాబట్టి ఇటువంటి వారిని దూరంగానే వుంచాలి.
అసూయ: మనం ఏదైనా మంచిపని చేస్తున్నప్పుడు దానికి ప్రతిఫలంగా ఏమైనా లభిస్తే.. అది చూసి కొంతమంది స్నేహితులు అసూయ పడతారు. అదేవిధంగా కొత్త వ్యక్తులతో స్నేహంగా మాట్లాడినప్పుడుగాని, ఎల్లప్పుడూ విజయాలు సాధిస్తున్నప్పుడు వారు మనమీద కోపం పెంచుకోవడం మొదలుపెడతారు. అటువంటి భావాలు వారి మొహం మీద స్పష్టంగా వ్యక్తమవుతాయి. అలా గనుక అనిపిస్తే.. తక్షణమే అతనితో ఫ్రెండ్ షిప్ కట్ చేసుకుంటే చాలా మంచిది.