Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యకరమైన, కాంతివంతమైన కేశాలకోసం నూనే రాయడం తప్పనిసరి. అయితే నూనే రాసే పద్ధతుల వల్ల కూడా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అవేంటంటే...
దురుసుగా రుద్దడం: వెంట్రుకలు చాల సున్నితమైనవి. అతిగా రుద్దడం వలన తెగిపోయి రాలిపోయే అవకాశం ఉంది. అలాగే, మాడు పైన చర్మం కూడా చలా సున్నితంగా ఉంటుంది. అందువలన నూనే రాసినప్పుడు వెంట్రుకలను, తల పై చర్మాన్ని మృదువుగా వలయాకారంలో నిమురుతూ ఆయిల్ మర్దన చెయ్యాలి. లేకపోతే వెంట్రుకలు బలహీన పడి రాలిపోయే అవకాశం ఉంది.
తడి జుట్టుకు నూనే రాయడం: స్నానం చేసిన వెంటనే ఆయిల్ రాయడం కూడా ప్రమాదకరమైనదే. ఎందుకంటే వెంట్రుకల మొదళ్ళు చలా సున్నితంగా ఉండడమే కాదు, తడిగా ఉన్నప్పుడు కొంచెం ఒత్తిడికి కూడా రాలిపోయేంత మృదువుగా తయారవుతాయి. అందుకని తడిగా ఉన్నప్పుడు కాకుండా పూర్తిగా ఆరిన తరువాతే వెంట్రుకలకు ఆయిల్ పెట్టుకోవాలి.
చివర్లకు నూనే రాయక పోవడం: చాలా సార్లు ఆయిల్ రాయడం స్కాల్ప్, మొదళ్ళకే పరిమితం చేస్తాం. వెంట్రుకల చివర్లకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వం. దీనివల్ల చివర్లకు సరైన పోషణ లభించక చిట్లిపోతాయి. ఇది జుట్టు పెరుగుదలను ఆపడమే కాకుండా రాలి పోవడానికి కూడా కారణమవుతుంది.
సరైన నూనే వాడకపోవడం: చాలామంది నూనే అంటే కొబ్బరి నూనే అనుకుంటారు. ఇతర నూనెలను పట్టించుకోరు. కాని నూనెలలో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి. పోషణకు కొబ్బరి, పెరుగుదలకు బాదం మంచివి. ఇంతేకాక, ఆమ్ల, శికాకారు లాంటి నూనెలు కూడా జుట్టుకు సరైన పోషణను అందిస్తాయి. అందుకే సరైన నూనేను ఎంచుకోవడం కూడా ముఖ్యమే.