Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా వృద్దాప్యం చేరువవుతున్న కొలది వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభమవుతాయి. కానీ ప్రస్తుతకాలంలో చిన్న వయసులోనే జుట్టు రంగు మారటం వలన చాలా మంది రంగు వేయటం ప్రారంభిస్తున్నారు. కానీ ఈ ఆహార పదార్థాలను మీ ప్రణాళికలో కలుపుకొంటే రంగు వేసుకోవలసిన అవసరమే ఉండదు.
పచ్చని ఆకుకూరలు: పచ్చని ఆకుకూరలు తలపై చర్మం పునరుద్దపరిచే విటమిన్ 'బి' ని కలిగి ఉంటుంది. సాధారణంగా ఎర్రరక్తకణాల ఉత్పత్తికి, వెంట్రుక యొక్క అన్ని భాగాలకు రక్తం పంపిణి చేయటానికి తలపై చర్మానికి విటమిన్ 'బి-6', విటమిన్ 'బి-12' అవసరం. మన జుట్టు నల్లగా ఉండటానికి లేదా సహజ రంగులో ఉండటానికి విటమిన్ 'బి-2' పై ఆధారపడి ఉంటుంది.
సూపర్ సాల్మన్: వెంట్రుకల ఆరోగ్యానికి కావలసిన హార్మోన్లు స్రవించుటకు సాల్మన్ చేపలో ఉండే సెలీనియం తప్పక అవసరం. మీ జుట్టు నెరవటాన్ని ఆపుటకు వారంలో రెండు లేదా మూడు సార్లు సాల్మన్ చేపను తినండి.
గుడ్లు: మీ జుట్టు తెల్లగా మారటాన్ని ఆపాలంటే రోజూ విటమిన్ 'బి-12' తినండి. మీకు కావలసిన ఈ పోషకం గుడ్డులో లభిస్తుంది. నిజానికి ఫ్రీరాడికల్ లు మన వెంట్రుకలను తెల్ల రంగులోకి మారటాన్ని ప్రోత్సహిస్తాయి. అందుకుఏ రోజూ తినే ఆహార పదార్థాల్లో ఒక గుడ్డును చేర్చుకుంటే జుట్టు త్వరగా తెల్లబడదు.
మాంసం, కాలేయం: యువకుల్లో జుట్టు తెల్లగా మారటానికి గల కారణం అనీమియా, ఐరన్ లోపం అని చెప్పవచ్చు. ఈ సమస్య నుండి బయటపడాలంటే మాంసం, కాలేయాన్ని తినండి. ఇవి శరీరానికి కావలసిన ఐరన్ ను అందిస్తాయి.