Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతిగా సెల్‌ఫోన్ వాడితే ఎన్ని సమస్యలొస్తున్నాయో ఇప్పటికే పలు పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. అయితే రోజువారీ జీవితంలో ఇది తప్పనిసరి అయ్యింది. కాబట్టి సెల్‌ఫోన్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రేడియోషన్ ముప్పు కొంతైనా తగ్గుతుంది.
- బ్యాటరీ ఛార్జీ తక్కువగా ఉన్నప్పుడు మాట్లాడొద్దు. ఛార్జింగ్ రెండు పాయింట్లు వున్నప్పుడు మాట్లాడితే అయిదురెట్లు రేడియేషన్ ప్రభావం ఉంటుంది.
- అప్పుడప్పుడు డయల్కాల్స్, రిసీవ్డ్ కాల్స్ టైమింగ్స్ పరిశీలించుకోవాలి. వారానికి ఎన్ని గంటలు మాట్లాడుతున్నామో అర్థం అవుతుంది. దాన్నిబట్టి తగ్గించుకోవచ్చు.
- ప్రతి చిన్న విషయానికీ ఫోన్ చేయక్కర్లేదు. పొట్టి సందేశాలతో అవతలివారికి విషయాన్ని చేరవేయొచ్చు. మెసేజ్లనలు ఇవ్వడం ఒక అలవాటుగా చేసుకోవడం ఉత్తమం.
- వేసవిలో వేడితీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల గంటల తరబడి ఛార్జింగ్ పెడితే సమస్యలొస్తాయి. పాతఫోన్లు అయితే ఒక్కోసారి పేలిపోయే ప్రమాదమూ లేకపోలేదు. దీర్ఘకాలంగా ఏ చిన్న సమస్య వేధిస్తున్నా ఫోను మార్చడం బెటర్.
- పూర్తిస్థాయిలో ఛార్జింగ్ పెట్టిన తర్వాత కూడా తొందరగా ఛార్జింగ్ ఖర్చవుతుంటే బ్యాటరీ మార్చక తప్పదు. త
- మల్టీమీడియా ఫోన్లలో అప్లికేషన్లను ఆన్‌లో ఉంచకూడదు. దీనివల్ల ఇంటర్నెట్ ద్వారా ఆటోమేటిక్ అప్లోడ్స్ పెరిగిపోయి ఫోన్లోని సాఫ్ట్వేర్ నెమ్మదిస్తుంది. తద్వారా ఇబ్బందులొస్తాయి.
- వ్యాపార, ఉద్యోగాలరీత్యా ఎక్కువ సేపు మాట్లాడాల్సి వస్తే బ్లూటూత్, ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మాట్లాడితే దుష్ప్రభావాలు తగ్గుతాయి.