Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్లాస్టిక్ వస్తువులు వాడడం మంచిది కాదని ఈ మధ్య కాలంలో ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఒక్కోసారి తప్పని సరి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వస్తువులను కొనాల్సి వస్తుంది. కొత్తగా కొన్న ప్లాస్టిక్ వస్తువులు విపరీతమైన వాసన వస్తుంటాయి. అలా వాసన రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు.
ముందుగా వాటిని చల్లటి నీటితో కడిగేయాలి. తరువాత ఒక టబ్ నీటిలో 10 నిమిషాలు ఆ వస్తువులను నానబెట్టాలి. తరువాత బయటకు తీసి పొడి బట్టతో తుడవటం వలన వాసన తొలగిపోతుంది.
కొత్తప్లాస్టిక్ వస్తువులను కొనుగోలు చేసినప్పుడు వాటినుండి కొత్తగా ప్లాస్టిక్ వాసన వస్తుంటే న్యూస్ పేపర్ తీసుకుని ఉండచుట్టి ప్లాస్టిక్ వస్తువులలో స్టఫ్ చేసి పెట్టాలి. ఇది ప్లాస్టిక్ వాసన తొలగించడానికి చాలా సహాయపడుతుంది. తరువాత మరుసటి రోజు వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి.
బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్ళు కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ వస్తువులకు అప్లై చేసి ఒకటి లేదా రెండు రోజులు అలానే ఉంచి మంచి నీటితో కడుక్కుంటే మొండి మరకులు తొలగిపోతాయి.
ప్లాస్టిక్ వస్తువులను శుభ్రం చేయడానికి మరో ఉత్తమ మార్గం నిమ్మరసం. నిమ్మతొక్కతో ప్లాస్టిక్ వస్తువులను రుద్ది కడగడం వలన ప్లాస్టిక్ వాసన ఇతర ఆహార పదార్థాల వాసనలు తొలగిపోతాయి. ు