Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ. అంతకన్నా టెస్టింగ్ టైమ్ అంటూ ఉంటుందా.. ఇబ్బందిగా ఉండే బట్టలతో ఇంటర్వ్యూకు హాజరుకావటం ఎంత ఇబ్బందో.. షూ మరీ పాతగా ఉంటే అక్కడకు వెళ్లటం కూడా అంతే ఇబ్బంది, కంపు కొట్టే లెదర్ షూతో మరీ ఇబ్బంది. అందుకే సెమీ-ఫార్మల్ షూ ధరిస్తే ఎలాంటి ఇంటర్వ్యూకు హాజరైనా ఇబ్బంది ఉండదు. బ్లాక్, బ్రౌన్ ఎప్పటికీ క్లాసిక్ కలర్స్. ఇక్కడ ప్రయోగాలను చేయాలనుకుంటే తమ యాక్ససరీలను తమ షూతో మ్యాచ్ అయ్యేలా ధరించవచ్చు.
ధరించే షూ కలర్, డిజైన్తో తాము ధరించిన యాక్ససరీలు మ్యాచ్ అయితే బాగుంటుంది. ఏ కాలంలో అయినా బ్లాక్, బ్రౌన్ ఫుట్వేర్కు తొలి ప్రాధాన్యం ఉంటుంది. మురికి నేలపై ఇతర రంగుల పాదరక్షలు ధరిస్తే మెయిన్టెన్ చేయడం కష్టమే. ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక దుస్తులు ధరించడంలో ఉన్న సరదా.. షూలో ఉండదు. ధరించిన వస్త్రాలకను గుణంగా కాళ్ల చెప్పులు ఉండాలి. లెదర్ షూ ఈ సీజన్లో ధరించకూడదు. అలాగే కొత్త షూ కూడా..! ఈ సీజన్లో వైవిధ్యమైన కలర్స్ బాగుంటాయి కానీ.. సందర్భం కూడా చూసుకోవాలి. ఇంటర్వ్యూకు వెళ్తూ రెడ్ లేదంటే ఎల్లో షూ వేసుకోవడం మంచిది కాదు.
చలికాలంలో స్పోర్ట్స్ లేదంటే కాన్వాస్ షూ ధరించకపోవడం మంచిది. దీని వల్ల బ్యాక్టీరియావద్ధి చెందేందుకు ఎక్కువ అవకాశం వీటిలో ఉంటుంది. కాస్త చలిగా, తడిగా ఉన్నప్పుడు షూ లేదంటే శాండిల్స్ను షూ ర్యాక్లో పెట్టకుండా ఆరనివ్వాలి. ు