Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలివికి, శరీర ఆరోగ్యానికి సంబంధం ఉంది అంటున్నారు పరిశోధకులు. తెలివితేటలు ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో మానసిక రుగ్మతలు, ఒత్తిడి, ఆందోళన అనేవి ఎక్కువగా ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాధారణ తెలివితేటలు కల వ్యక్తులతో పోలిస్తే ఎక్కువ తెలివితేటలు గల వ్యక్తుల్లో ఆరోగ్య సమస్యలు పది శాతం ఎక్కువగా ఉంటాయన్న విషయం అధ్యయనంలో వెల్లడైంది. సుమారు 500 మంది చిన్నారుల మీద సుదీర్ఘకాలం పాటు అధ్యయనం నిర్వహించారు. వీరి ఆరోగ్య పరిస్థితి, ఆలోచనా విధానం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వారిలో 200 మంది చిన్నారులు మామూలు కన్నా ఎక్కువ తెలివితేటలు కలిగిన వారు. మిగతా వారు సాధారణ తెలివితేటలు కలిగిన వారు. వీరిలో పదిశాతం మందికి 18 నుంచి 20 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి ఒత్తిడి, ఆందోళనా, డిప్రెషన్ వంటి సమస్యలే కాకుండా కొన్ని మానసిక రుగ్మతలను కూడా అధ్యయనకారులు గుర్తించారు. సాధారణ తెలివితేటలు కలిగిన పిల్లల్లో పై సమ్యలను అధ్యయనకారులు గుర్తించలేదు. అయితే ఎక్కువ తెలివితేటలు కారణంగానే వారిలో మానసిక రుగ్మతలు తలెత్తాయా? అన్న విషయం మీద ఇంకా అధ్యయనాలు నిర్వహించాలని వైద్యులు చెబుతున్నారు. ు