Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా వరకూ పూలమొక్కలు చలికాలంలో విరబూస్తాయి. ముఖ్యంగా బంతులు, చామంతులు విరబూస్తాయి. వికసించిన పూల అందాలతో తోటంతా కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. మరి చలికాలంలో పూలతోట మీ ఇంటి ముందు కనిపించాలంటే కొంత ప్లాన్ చేసుకోవాలి. చలికాలంలో ఫ్లవర్ గార్డెన్ మీద కొంచెం శ్రద్ద, మనసు పెడితే మరింత అందంగా కనిపిస్తుంది. ఈ సీజన్ లో పువ్వులు రాలిపోయి తిరిగి కొత్తగా పువ్వులు రావడం ప్రారంభిస్తాయి.
మొక్కల కాండం చివర్లు, మొక్కల చుట్టూ రాలిపోయే పువ్వలను తొలగించాలి. ఇలా చేయడం వల్ల మొక్కల ప్యాథోజెన్స్ అనే వ్యాధులు సంక్రమించకుండా సహాయపడుతుంది.
మొక్కల మీద క్రిమి కీటకాల గుడ్లు తొలగించాలి.
పూలమొక్కల అడుగున పాదులు తీయాలి. కుండీల్లో పెంచేవారు ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్‌ను మొక్కల మొదల్లో వేయాలి.
చిన్న మొక్కలు మాత్రమే కాదు, పెద్దపెద్ద మొక్కలు కూడా చలికాలంలో బిగుసుకు పోయినట్టు కనిపిస్తాయి. కాబట్టి, సరైన టైమ్ కు నీళ్ళు పట్టాలి.
తోటలో ఎక్కుగా పేరుకుపోయిన చెత్తా చెదారం తొలగించాలి. ఎరువులు సక్రమంగా వేయడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతాయి.
చలికాలంలో ఫంగస్ ఎక్కువగా ఏర్పడుతుంది. దాంతో స్టెమ్ క్రాకర్స్ కు కారణం అవుతుంది. కొద్దికొద్దిగా ఎరువును వేయాలి. నెలలో ఒకటి లేదా రెండు సార్లు ఎరువులు వేయాలి. ఇలా వేయడం వల్ల మొక్క కాండం బలపడి చలి నుండి మొక్కను రక్షిస్తుంది.
వాతావరణం చల్లగా ఉందని వదిలేయకుండా మొక్కకు సరిపడా నీరు పోయాలి అప్పుడే మొక్కలు బాగా పెరుగుతాయి. పువ్వులు ఎక్కువగా వస్తాయి.