Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెంపుడు కుక్కలు ప్రేమ, స్నేహానికి మారుపేరుగా ఉంటాయి. కుటుంబసభ్యుల్లో ఒకరుగా మారిపోయే వాటితో సమయాన్ని వెచ్చించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో కుక్కను పెంచుకోవడమంటే కచ్చితంగా అదనపు బాధ్యత తీసుకోవడమే. ఎందుకంటే వీటికి ప్రత్యేకమైన నిర్వహణ అవసరం. మీరు చూపించే శ్రద్ద, ప్రేమ ఆధారితంగా ఈ మూగజీవాలు ఉత్తమ స్నేహితులుగా మారుతాయి. వాటి పెంపకంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..
ప్రతిరోజు వాటికి స్నానం చేయించడం సాధ్యం కాదు. అలాంటి సమయాల్లో వాటి చర్మాన్ని తరచుగా బ్రష్ చేయాలి. కుక్కలు, పిల్లులు తమ చర్మాన్ని బ్రష్ చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడుతాయి. దీనికి పెద్ద సమయం కూడా పట్టదు, పైగా అవి మీ ప్రేమను ఎంతో ఆస్వాదిస్తాయి. బ్రష్ చేయడం ద్వారా, వాటి జుట్టు మీద ఉండే దుమ్ము అధిక శాతం తొలగిపోవడంతో పాటు, ఊడిపోతున్న వెంట్రుకలను తొలగించడం సాధ్యమవుతుంది. అంతేకాదు వాటి శరీరం నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది.
కుక్క నోటి పరిశుభ్రతపై ఆసక్తిని చూపండి. మీ పెంపుడు కుక్క దంతాలకు మంచి స్క్రబ్బింగ్ ఇవ్వడం ద్వారా చెడు శ్వాస నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. వాటి చెవులను తరచుగా శుభ్రపరచాలి. దీని ద్వారా వాటి నుంచి వచ్చే చెడు వాసనను తొలగించవచ్చు. చెవులను శుభ్రం చేసే ప్రక్రియలో, కాటన్ బాల్స్, బేబీ ఆయిల్ ఉపయోగించాలి. ఇయర్ బడ్స్ వాడవద్దు.
పెంపుడు కుక్క విషయంలో పరిశుభ్రతను పాటించడం అత్యంత ముఖ్యమైన విషయం. అది నిద్రపోయే పరుపు పై అనేక రకాల క్రిములు చేరి దుర్వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే వాటి పడకను శుభ్రపరచడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగిస్తే మంచిది.
దుర్వాసనకు దూరంగా ఉంచేలా వాటి మీద బేకింగ్ సోడా చల్లుతూ, మీ అరచేతులతో లేదా ఒక మృదువైన బ్రష్ సహాయంతో మసాజ్ వలె రుద్దడం ద్వారా ఈ పొడి స్నానం చేయవచ్చు. కొంతసేపు అలాగే ఉంచిన తర్వాత, దువ్వెనతో దువ్వాలి. ఆ తర్వాత టవల్ తో శుభ్రపరచాలి. ఈ పద్దతి స్నానం చేసిన అనుభూతిని, తాజాదనాన్ని ఫీలవుతుంది. ఈ పద్దతి మీ పెంపుడు నేస్తం జ్వరంతో బాధ పడుతున్నప్పుడు, స్నానానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది. ు