Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలతో: ఒక కప్పు వేడి పాలలో చెంచా తేనె కలిపి పిల్లలతో తాగిస్తే అలసట దూరమై పుష్టిగా తయారవుతారు. కడుపులో క్రిములను, పుండ్లను తగ్గించడానికి, రక్తలేమిని నివారించడానికి ఇది చక్కని ఔషధం. రాత్రి పడుకునే ముందు తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది.
నోటి పొక్కులకు: రెండు చెంచాల తేనె, నాలుగు చెంచాల నిమ్మరసం, చిటికెడు ఉప్పు బాగా కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించాలి. ఇలా చేస్తే నోట్లో పొక్కులు, దుర్వాసన తగ్గుతాయి.
తేనె టీ: పొద్దున్నే కాఫీ, టీలకు బదులుగా తేనె టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పరగడుపున కప్పు వేడినీళ్ళలో చెంచా తేనె కలిపి మెల్లగా చప్పరిస్తూ తాగాలి. అజీర్తి సమస్యలకు ఇది చక్కని ఔషధం. రోజుకు రెండు మూడు సార్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది.
నిమ్మరసంతో: కప్పు వేడినీళ్ళలో కొంచెం నిమ్మరసం, చెంచా తేనెను బాగా కలపాలి. దీన్ని తాగితే మంచి ఫలితాలుంటాయి. ముఖ వర్చసు పెరుగుతుంది. శరీరం మీద మచ్చలు చాలా తేలిగ్గా తగ్గుతాయి. జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.