Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రకరకాల ప్రాంతాల నుంచి భిన్న అభిప్రాయాలు కలిగినవారు ఒక చోటుకు చేరుకుంటారు. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వం, ఒక్కొక్క అలవాటును కలిగి వుంటారు. కొందరు చదువులో మంచి ప్రతిభను కనబరిస్తే... మరికొందరు సాంస్కృతిక కార్యక్రమాల్లో మంచి ప్రావీణ్యం కలిగిన వారుంటారు. కొందరు ఆటపాటల్లో ఆరితేరితే... మరికొందరు సాహసోపేతమైన విద్యలను ప్రదర్శించేవారుంటారు. ఇటువంటి భిన్నరకాల విద్యార్థుల మధ్యే మన జీవితానికి పునాది వేసుకోవాలి. ఒక్కొక్కరు పరస్పరం పలకరించుకుంటూ.. వారి దగ్గరున్న సకల విద్యల గురించి తెలుసుకుంటూ.. మనలో వున్న ప్రతిభను వారికి అందించేలా వుండాలి. బంగారు భవితను సక్రమంగా తీర్చిదిద్దుకోవడానికి, అన్నివిధాలుగా వృద్ది సాధించడానికి కాలేజీ జీవితమే సరియైన సమయం. కాబట్టి అందుకు తగ్గట్టుగా కొన్ని ప్రణాళికలను అలవరుచుకోవల్సి వుంటుంది.
నలుగురితో కలిసికట్టుగా
కాలేజ్‌లో నలుగురితో కలివిడిగా వుంటూ, స్వేచ్ఛను పంచుకోవాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి, వారి అలవాట్లకు అనుగుణంగా ఎలా మలుచుకోవాలి అనే విషయాలను కాలేజీ క్యాంపస్ నుంచే తెలుసుకోవడానికి వీలుగా వుంటుంది. అప్పుడే భవిష్యత్తులో ఎక్కడైనా ఉద్యోగం చేస్తునపుడు అక్కడి టీంవర్క్లో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనవచ్చు. నలుగురితో కలిసికట్టుగా లేకుండా కేవలం ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తే... మనకు లభించాల్సిన లోకజ్ఞానాన్ని కోల్పోతాం. ఉద్యోగాల్లో ఎవరితో మాట్లాడకుండా వుంటే.. అటువంటి ఉద్యోగాల్లో రాణించడం కష్టతరం అవుతుంది. కాబట్టి యుక్తవయస్సులోనే నలుగురితో కలవడిగా వుంటేందుకు ఆసక్తిని కలిగి వుండాలి.
లక్ష్యాలు అవసరం
కాలేజీలో మొదటి రోజునుండే మీ జీవిత లక్ష్యాలు, ఆశయాల గురించి ఒక దృఢమైన నిర్ణయాన్ని ఏర్పరుచుకోవాలి. దానికి అనుగుణంగానే మీ తోటి విద్యార్థుల సహాయాన్ని, సలహాలను పాటించుకోవాలి. మొదటినుంచే మీ గమ్యాన్ని చేరే సరైన దారిని ఎంచుకోవాలి. ఆ దారిబాటలోనే ప్రయాణం కొనసాగించాలి. అయితే కొంతమందికి వాటిని ఎలా అలవరుచుకోవాలో, వారి అభిరుచులేంటో తెలియక తికమకపడుతుంటారు. అటువంటి వేళల్లో కాలేజీలో వున్న తోటి స్నేహితుల సహాయంతో వాటి గురించి తెలుసుకోవడానికి ఎంతో వీలుగా వుంటుంది.
ప్రత్యేకత చాటాలి
ప్రతిరోజూ క్లాసులతో పాటు కాలేజీలో నిర్వహించే సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలలోనూ పాల్గొనాలి. ఆల్ రౌండర్‌గా వుంటూ మీలో వున్న ప్రతిభను ప్రదర్శించుకోవాలి. దీంతో తమదైన ఒక ప్రత్యేక ముద్రను నలుగురిలో ఏర్పాటు చేసుకోవచ్చు. రకరకాల మనుషులను, వారి మనస్తత్వాలను, వారి అలవాట్లను, వారి జీవన విధానాలను తెలుసుకోవచ్చు. దాంతో కాలానికనుగుణంగా నడుచుకోవడం తెలుస్తుంది.
చెడు అలవాట్లకు దూరంగా
ఉన్నత జీవన విధానాన్ని పొందుపరుచుకోవాలంటే ముందుగా మీలో వున్న చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి. అంటే ఇతరులకు అబద్ధాలు చెప్పడం, సరిగ్గా క్లాసులకు హాజరు కాకపోవడం, ఇతరులపై లేనిపోని నిందలు మోపడం, గొడవలకు దిగడం వంటి లక్షణాలను ఎప్పటికీ అలవాటు చేసుకోకూడదు. కాలేజీ జీవితంలో ఇటువంటి అలవాట్ల నుంచి దూరంగా వుంటే భవిష్యత్తులో కూడా అవి మన జోలికి రావు.
చదువుపై ధ్యాస పెట్టాలి
కాలేజీలో వున్న నేటి యువతీయువకులు కేవలం మార్కుల కోసమే వస్తుంటారు. ఏదో కాలేజీకి వచ్చామా, స్నేహితులతో సమయాన్ని గడిపామా, తిరిగి ఇంటికి చేరుకున్నామా అనే స్వభావంతో కాలేజీకి వస్తుంటారు. ప్రత్యేకంగా చదువు మీద ధ్యాసను చూపించరు. ఏదో బట్టీకొట్టి చదివి, పాస్ మార్కెలకు మాత్రమే పరిమితమవుతతారు. అయితే దీనివల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. మీరు ఏ సబ్జెక్ట్ అయితే చదువుతారో దాన్ని మీ జీవితానికి అన్వయించుకుని చదువుకోవాలి.
ఈ విధంగా కొన్ని ప్రణాళికలను అలవరుచుకుంటే... కాలేజీ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతూనే.. భవిష్యత్ కార్యాచరణను మలుచుకోవడంలో విజయాన్ని సాధిస్తారు.
కాలేజీలో చేరవల్సి వచ్చింది. అప్పటి వరకు కలిసి ఉన్న స్నేహితులను వదిలిపెట్టి రావడం చాలా కష్టంగా అనిపించింది. అయినా తప్పదు. కొత్తగా చేరిన కాలేజీలో మళ్ళీ స్నేహితును సంపాదించుకోవడమంటే మామూలు విషయం కాదు. వారి ఆలోచనలకు, తన ఆలోచనలు సరిపోతాయో లేదో..! మధ్యలో వచ్చి చేరండం వల్ల తనతో స్నేహం చేస్తారో లేదో..? ఇలాంటి అనుమానాలతో కాలేజీలోకి అడుగుపెట్టింది. ఇలాంటి పరిస్థితి మధ్యలో కాలేజీ మారిన ఒక్క మృదులకే కాదు. కొత్తగా కళాశాలలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ ఉంటుంది.