Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూ ఆర్ ఎ బ్యాడ్ గాళ్/బోయ్.. ఇలాంటి ప్రతి కూల విషయాలతో పిల్లల మెదళ్లను నింపకండి. ఇవి వాళ్లలోని ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. పిల్లలు అమాయకులు. వాళ్లు మంచినే విశ్వసిస్తారు. అందుకే వాళ్లకు ఎప్పుడూ మంచిగా, సంతోషంగా, సానుకూలంగా ఉండటమే బోధించండి. ఇతరులను గాయపరిచే, ఇబ్బంది పెట్టే పనులు, మాటలను చెప్పండి. అవి ప్రయోగించకూడదని చెప్పండి. నువ్వు చాలా బెస్ట్... ప్రపంచంలో తెలివైన వ్యక్తివి వంటి సానుకూల పదాలను ప్రయోగించండి.
- అన్నలా ఎందుకు లేవు? అక్కలాగా ఎందుకు చదవవు... ఇలాంటి పోలికలు అస్సలు వద్దు. ఇవి వారిలో అసూయా, ద్వేషాలను కలిగిస్తాయి. ఒంటరిగా ఫీలవుతారు. నిస్సహాయులమన్న భావన వస్తుంది. తోబట్టువుల మధ్య అపార్థాలు పొడచూపుతాయి.
- ఎప్పుడు నేరుగా 'వద్దు' అని చెప్పండి. ఎందుకంటే మీ చిన్నారికి అది చాలా కష్టాన్ని కలిగిస్తుంది. ఎప్పుడూ 'వద్దు' అని వినడం వల్ల వాళ్లు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. వాళ్ల చర్యలు మీకు నచ్చకపోతే ... దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇవ్వండి. అరవకుండా నెమ్మదిగా మాట్లాడండి.
- పిల్లలు ఏదైనా చేస్తున్నప్పుడు 'మీకు చేతకాదు' అని చెప్పకండి. 'ప్రయత్నించు... కావాలంటే నేను సహాయం చేస్తా' అని మాత్రమే చెప్పండి. లేదంటే... 'అది నీకు కష్టమవుతుంది. నేను చేస్తాను, లేదంటే ఇద్దరం కలిసి చేద్దాం' అని చెప్పండి. ట్రయల్ అండ్ ఎర్రర్తోనే పిల్లలు కొత్తగా చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకపోతే.. భవిష్యత్లో ఏది చేయాలన్నా భయపడతారు.
- పిల్లలతో ఎప్పుడూ చెప్పకూడని మాట 'నాతో మాట్లాడకు'. పిల్లలకు మీకు మధ్య కమ్యూని కేషన్ను ఎప్పుడూ పోగొట్టుకోకండి. పిల్లలు మాట్లాడటాన్ని, వాదించడాన్ని అస్సలు వారించకండి. ప్రశ్నలు వేయనియ్యండి. వాళ్ల అభిప్రాయాలను నిర్భయంగా పంచుకోనివ్వండి. మీకు నచ్చిందే చేయాలని, మీరు చెప్పిందే వినాలని పట్టుబట్టకండి. మీరు చెప్పేది ఎందుకు చేయాలో.. సున్నిత మాటల్లో, హావభావాలతో చెప్పండి. మీరు చెప్పాలనుకున్నది వాళ్లకు అర్థమయ్యేదాకా మాట్లాడుతూ, వింటూ ఉండండి.
- అమ్మాయిలు అది చేయకూడదు, అబ్బాయిలు ఇది చేయకూడదు వంటి పదాలను అస్సలు వాళ్ల ముందు ప్రయోగించకండి. చిన్నవయసునుంచే వాళ్లలో లింగవివక్షను పెంచిపోషించకండి. వాళ్లకు నచ్చిన విషయాలను నేర్చుకోవడాన్ని, తెలుసుకోవడాన్ని ఆపకండి.
- 'నన్ను ఒంటరిగా వదిలేయి' అనే మాటలను ఎప్పుడూ అనకండి. మీ పిల్లలకు మీరే ప్రపంచం. తామంటే ఇష్టం లేదని, లేదా తమని ప్రేమించడం లేదనే భావనను పిల్లల్లో ఎప్పుడూ రానివ్వకండి. మీరు ఎంత చిరాకులో అయినా ఉండండి.. ఎంత ప్రశాంతత అయినా కావాలనిపించనివ్వండి... పిల్లలతో మాట్లాడండి. అదే సహనాన్ని నేర్పిస్తుంది.
- 'ఇట్ల చేస్తున్నవు కదా... ఫలానావాళ్లు రానివ్వు చెబుతాను' వంటివి ప్రయోగించకండి. అవి మీ పిల్లల్లో భయాన్ని, యాంగ్జైటీని పెంచుతాయి. అంతేకాదు.. ఆ సమస్యను, లేదా ఆ వాతా వరణాన్ని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారనడానికి కూడా అర్థం. కాబట్టి వాళ్లు చేసిన తప్పు లకు, వాళ్లే బాధ్యులని తెలుసుకునేలా చెప్పండి.
- 'నీలాంటి పిల్లను కావాలని ఎవ్వరూ కోరుకోరు' వంటివి కూడా అనకండి. వాళ్లేమైనా చేస్తున్నా రంటే, మాట్లాడుతున్నారంటే కేవలం వాళ్లే బాధ్యులు కాదు. వారి చుట్టుపక్కల ఉన్న వాతావరణం, కుటుంబం, బంధువులు, ఫ్రెండ్స్. ఆ వాతావరణాన్ని సృష్టిస్తున్నది మీరే కాబట్టి... వాళ్ల చర్యలకు మీరే బాధ్యులు.
- ఇంత పెద్దగయ్యి... ఇంకా చిన్నపిల్లల చేతలేంటి? అంటుంటారు చాలా మంది. కానీ అలా అన కూడదు. వాల్లలోని పిల్ల మనసును పోగొట్టకండి. పిల్లలు పెరుగుతారు. కాబట్టి వాళ్లలా మీరు ఉండండి. వాళ్లు సౌకర్యంగా ఫీలవ్వడమే కాదు.. మీరూ సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రులుగా పిల్లలను సంతోషంగా ఉంచడం బాధ్యత.