Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందుగా గోళ్లు కొరికే అలవాటును దూరం చేసుకోవాలి. గోళ్లను కొరకడం వల్ల అవి పెట్లిపోయి.. ఒక్కోసారి చిగుళ్ల నుంచి రక్తం కారి చూడ్డానికి బాగా ఉండదు.
మంచి మాయిశ్చరైజింగ్ లోషన్‌తో తరుచూ గోళ్లను మసాజ్ చేయాలి. గోళ్ల వద్ద రక్తప్రసరణ సవ్యంగా జరిగితే అవి బలంగా, పొడవుగా పెరిగే వీలుంటుంది.
ఆలివ్ నూనెలో ముంచిన దూదితో తరచూ గోళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు క్రమం తప్పకుండా చేస్తే గోళ్లు నాజూగ్గా పెరుగుతాయి.
గోళ్ల సందుల్లో మురికిని తొలగించడానికి సూదులు, అగ్గిపుల్లల్లాంటివి వాడటం మంచిది కాదు. మెత్తటి వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి.
గోళ్లు అందంగా, బలంగా పెరగాలంటే ప్రొటీన్లు, కాల్షియం ఉన్న ఆహారం తీసుకోవాలి.
నెయిల్ పాలిష్ విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఏ రంగు పడితే ఆ రంగు వేసుకుంటే గోళ్లు అందంగా కనిపించవు. మీ ఒంటికి నప్పే రంగు, మీ డ్రెస్‌కు మ్యాచయ్యే కలర్ ఎంపిక చేసుకుంటే మీ గోళ్లకు అదనపు అందం వస్తుంది.