Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖర్బూజ పండులో బోలెడు సుగుణాలు ఉన్నాయి. ఆరోగ్యానికికే కాదు ఈ పండు చర్మానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. అవేంటో చదవండి....
- ఖర్బూజ ముక్కలు కోస్తుంటే రసం కారి పోతుంటుంది. మామూలుగా అయితే ఆ రసాన్ని పారబోస్తుంటారు కదా. ఈ సారి అలా చేయకుండా ఆ రసాన్ని ఒక కప్పులోకి తీసుకోవాలి. కోసుకున్న ఖర్బూజ ముక్కలు తినబోయేముందు ఖర్బూజ రసంలో దూదిని ముంచి ముఖం, మెడ మీద రాసుకోవాలి. మీరు ఖర్బూజ ముక్కలు తినే లోపులో చర్మం మీద మీరు రాసుకున్న ఖర్బూజ రసం ఆరిపోతుంది. కాబట్టి దానికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం ఉండదు. ముక్కలు తినడం పూర్తికాగానే కడిగేసుకోవచ్చు. ఇది మంచి టోనర్‌లా పనిచేస్తుంది.
- ఖర్బూజ పండు ముక్కల్ని బ్లెండర్లో వేసి మెత్తటి గుజ్జులా పట్టాలి. ఇందులో అర స్పూన్ నిమ్మరసం, శెనగపిండి వేసి ఫేస్‌ప్యాక్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద, మెడ మీద రాసుకుని పావుగంట తరువాత గోరు వెచ్చటి నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడిగేయాలి.
- ఖర్జూజ గుజ్జు పొడి చర్మానికి మంచి ప్యాక్. మిక్సీ పట్టిన ఖర్బూజ పండు గుజ్జులో కొద్దిగా పాల మీగడ, ముల్తానీ మట్టి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే చర్మానికి అవసరమైన తేమ అందుతుంది. చర్మం నిర్జీవం అయిపోకుండా మెరుస్తుంటుంది.