Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవికాలంలో సూర్యరశ్మి ప్రభావం కళ్ల మీద ఎక్కువగా ఉంటుంది. తీక్షణమైన ఎండ నుంచి సున్నితమైన కళ్లను కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.
ఎండ ప్రభావానికి గురికాకుండా చర్మ రక్షణ కోసం సన్‌స్క్రీన్స్ వాడినట్టే కళ్లకూ అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే చలువ కండ్లద్దాలు వాడాలి. సూర్యరశ్మి నేరుగా కండ్లలోకి పడకుండా ఎండలోకెళ్లినప్పుడల్లా తలకు క్యాప్ పెట్టుకోవాలి. ఎండాకాలం పార్క్‌లు, బీచ్‌లకు వెళ్లేవారు హ్యాట్-సన్‌గ్లాసెస్ కాంబినేషన్ వాడితే రెండు విధాల ఉపయోగం ఉంటుంది. అలాగే రాప్ అరౌండ్ ఫ్రేమ్ కలిగిఉండే సన్‌గ్లాసెస్ వాడితే ఏటవాలు సూర్యకిరణాలు కండ్లను తాకకుండా ఉంటాయి.
- వేసవి వేడి నుంచి ఉపశమనం కోసం స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టడానికి ఇష్టపడతాం. అయితే ఈ నీళ్లలోని క్లోరిన్ వల్ల కండ్లకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి కండ్లకు తప్పనిసరిగా గాగుల్స్ పెట్టుకోవాలి. ఈత తర్వాత శుభ్రమైన మంచినీళ్లతో కండ్లను కడుక్కోవాలి. ఇలా చేయటం ఎర్రబడిన కండ్లు తిరిగి మామూలుగా అయిపోతాయి.
- కండ్లకు చల్లని ఐప్యాక్ తరచుగా పెట్టుకోవాలి. ఇందుకోసం చక్రాల్లా తరిగిన కీర దోస ముక్కలు కండ్లపై పది నిమిషాలు ఉంచుకోవాలి. లేదంటే మజ్జిగలో ముంచిన
దూదిని మూసిన కనురెప్పల మీద ఉంచుకోవాలి. మజ్జిగ బదులు రోజ్ వాటర్ వాడినా ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి ఐ ప్యాక్స్ పెట్టుకోవడం వల్ల ఎండవల్ల అలసటకు గురయిన కండ్లకు ఉపశమనం లభిస్తుంది.
- వేడిగాలికి కండ్లు తరచూ పొడిబారుతుంటతాయి. ఇలాంటి ఇబ్బంది ఎదురైతే కంటి వైద్యుల్ని సంప్రదించి లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ తీసుకోవాలి. కంట్లో తడిని నిలిపి ఉంచే ఐ డ్రాప్స్ వల్ల కండ్లు పొడిబారకుండా ఉంటాయి. శరీరంలో నీటి శాతం తగ్గిపోయినా కళ్లు పొడిబారతాయి. కాబట్టి రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి.