Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాత్రంతా టీవీ, లేదా నెట్లో కాలక్షేపం చేయటం తగ్గించి ఉదయాన్నే నిద్రలేవటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయాన్నే లేవటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. తెలీకుండా మనిషిలో ఏదైనా చేస్తాననే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఉదయాన్నే నిద్రలేచాక ఇవి పాటించండి.
- నిద్రలేవాలనుకున్న సమయానికి అరగంట ముందు అలారమ్ సెట్ చేయాలి. ఉదయాన్నే నిద్ర లేచాక గోరు వెచ్చని నీళ్ళు లేదా నిమ్మరసం తాగటం వల్ల శరీరంలోని టాక్సిన్స్ నశిస్తాయి.
- కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ చేయాలి. అలా చేస్తే శారీరంగానే కాకుండా మానసికంగా కూడా రోజంతా చురుకుగా ఉంటారు.
- ఆ రోజు చేయాల్సిన పనుల్ని, ప్రధానమైన విషయాల్ని రాసుకోవాలి. ప్రతిరోజూ ఉదయాన్నే ఇలాగే చేసి అలవాటుగా మార్చుకుంటే రోజంతా హాయిగా గడిచిపోతుంది.