Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రసరణ బాగా జరిగినప్పుడే అవయవాలన్నీ చురుగ్గా పనిచేస్తాయి. ముఖ్యంగా తల, మెడ, వెన్నెముక భాగాలకు రక్తప్రసరణ మెరుగ్గా ఉండాలంటే హలాసనం వేయాల్సిందే. ఈ ఆసనంలో శరీరం నాగలిగా కనిపిస్తుంది కాబట్టి హలాసనం అంటారు. ఈ ఆసనం క్రమం తప్పకుండా వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.
హలాసనం
మొదట శవాసనం వేయాలి. తరువాత కాళ్ళు రెండూ కలిపి మెల్లమెల్లగా పైకి ఎత్తుతూ తలవైపుగా నేలపై ఆనించాలి. నడుముపై సపోర్ట్‌గా చేతులుంచాలి. పది నుంచి ముఫ్పై సెకన్ల పాటు అలాగే ఉండాలి. ఆసనంలో ఉన్నంతసేపూ శ్వాసను బయటనే ఆపాలి. పొట్టను లోపలికి పీల్చి ఉంచితే ఈ ఆసనం సులువుగా వేయవచ్చును. నెమ్మదిగా పూర్వస్థితికి రావాలి.
ఉపయోగాలు..
- హలాసనం వలన వెన్నెముక సంబంధిత కండరాలకు, నరాలకు బలం హెచ్చుతుంది.
- మెడకు రక్తప్రసారం చక్కగా జరుగుతుంది.
- నడుము సన్నబడుతుంది.
రపొట్టచుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గుతుంది.
జాగ్రత్తలు..
మొదట్లో యోగా నిపుణుల సమక్షంలోనే ఆసనం సాధన చేయాలి. ఆ తర్వాత ఇంట్లోనూ క్రమం తప్పకుండా హలాసనం వేయవచ్చు.
- సర్జరీలు అయిన వారు ఈ ఆసనం వేయవద్దు.