Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవి కాలం కాటన్ వస్త్రాలదే మొదటి ప్లేస్. అయినా వీటిని మెయింటెయిన్ చేయడంలో సమస్యలుం టాయని చాలా మంది వెనుకంజవేస్తుంటారు. ఈ సమస్యలు లేకుండా కాటన్ దుస్తులు ఎక్కువకాలం మన్నాలంటే...
- హ్యాండ్లూమ్ శారీ లేదా డ్రెస్ మొదటి ఉతుకులో గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు వేసి, అందులో 10-15 నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ తర్వాత ఉతుకులో రంగు అంతగా పోదు.
- కుంకుడు రసం కలిపిన నీళ్లలో ముంచి ఉతికి ఆరేస్తే కాటన్ చీరలు, డ్రెస్సులు దీర్ఘకాలం మన్నుతాయి.
- మూడు ఉతుకులకు ఒకసారైనా సరిపడినంత గంజి పెట్టాలి. ఇందుకు మార్కెట్లో లిక్విడ్ స్టార్చ్ కూడా లభిస్తుంది.
- బాగా ఆరిన తర్వాత ఇస్త్రీ చేస్తే, మళ్లీ కొత్తవాటిలా కనిపించడం హ్యాండ్లూమ్స్ స్పెషల్.