Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలపొడితో అనేక ఉపయోగాలనున్నాయి. ఇది చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది. పాలపొడిలో లాక్టోస్ సమృద్ధిగా ఉన్నందున, అనేక చర్మ సంబంధిత సమస్యలకు ఇది ఒక పరిష్కార మార్గంగా పనిచేస్తుంది. నల్లని మచ్చలు, సన్-బర్న్, టాన్నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మం కాంతులీనేలా చేస్తుంది.
- ఒక గిన్నెలో 3 స్పూన్ల పాలపొడిని తీసుకొని దానికి 1 చెంచా ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ అలాగే కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలపాలి. ఈ పదార్థాలన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. దూది సహాయంతో ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా మీ ముఖానికి అప్లై చేయాలి. మీ చర్మంపై ఉండే అదనపు మలినాలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై 15 నిమిషాల వరకు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై ఏర్పడే మలినాలకు కారణమైన బ్యాక్టీరియానుచంపుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
- ఒక టేబుల్ స్పూను పాలపొడిని తీసుకుని, ఒక టేబుల్ స్పూన్ పసుపు, చక్కెరను కలిపి మెత్తని పేస్టు తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాల్లో అప్లై చేయాలి. ఒక అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై ఏర్పడే మలినాలకు కారణమైన బ్యాక్టీరియాను మొదటిగా చంపుతుంది. ఆ తర్వాత చనిపోయిన చర్మకణాలను తొలగిస్తుంది.
- ఒక మెత్తని అరటిని తీసుకొని, దాని గుజ్జుని బాగా పేస్టులా చేయాలి. ఈ అరటి గుజ్జుకి 1 టేబుల్ స్పూన్ పాలపొడిని కలిపి, బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల వరకు దానిని అలాగే ఉంచి, ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మానికి హానిచేసే మలినాలను దూరంచేసి, మీ చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా చేస్తుంది. పొడిచర్మం ఉన్నవారికి ఈ చిట్కా మంచి ఫలితాలనిస్తుంది.
- ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నారింజ రసాన్ని, 2 టేబుల్ స్పూన్ల పాలపొడిని తగినంత నీరు చేర్చి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖము, మెడ భాగంలో ఆప్లై చేయాలి. 30 నిమిషాలపాటు ఆరనిచ్చి, చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు తప్పకుండా చేయటంవల్ల మంచి ఫలితాలు పొందుతారు. నల్లని మచ్చలు తొలగించేందుకు మరొక ప్రత్యామ్నాయమైన పరిష్కారం కూడా ఉంది. ఒక గిన్నెలోకి పాలపొడిని, కొద్దిగా రోజ్ వాటర్ తీసుకుని బాగా మిక్స్ చేసి, దూది సాయంతో మీ ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. మీ చర్మాన్ని సహజ స్థితిలోకి తీసుకు వస్తుంది.