Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యాక్సింగ్ చేయించుకున్న తరువాత కొంతమందిలో చర్మం కమిలిపోయి నొప్పి పుడుతుంటుంది. మరికొంతమంది చర్మంపై రాష్ వస్తుంటుంది. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా చర్మానికి హాని కలగకుండా కాపాడుకోవచ్చు.
- వ్యాక్సింగ్ చేయించుకున్న తరువాత చర్మానికి కనీసం ఒక రోజుపాటు ఎండ తగలకుండా జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. లేకపోతే చర్మం మండడంతో పాటు త్వరగా నల్లబడుతుంది. - వ్యాక్సింగ్ చేసుకున్న ఒక రోజువరకు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోకూడదు.
- వ్యాక్సింగ్ చేసుకునే ముందు చర్మానికి బేబీ పౌడర్ రాసుకోవడం వల్ల రాష్ రాదు.
- వ్యాక్సింగ్ చేసుకున్న తరువాత కొన్ని గంటలు చర్మాన్ని తడిగా ఉంచుకోవాలి. అందుకు ముందుగా చర్మాన్ని వేడి నీటితో శుభ్రంగా తుడుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది.
- వ్యాక్సింగ్ చేసుకున్న తరువాత చర్మం చాలా సున్నితంగా తయారవుతుంది. అందుకని చల్లనీటితో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. వెంటనే స్విమ్మింగ్ చేయకూడదు.
- వ్యాక్సింగ్ చేసేసిన చర్మంపై మాయిశ్చరైజర్లో కొంచెం చక్కెర కలిపి మర్దనా చేయడం వల్ల చర్మంపై మిగిలిన వెంట్రుకలు, మతకణాలు తొలిగిపోతాయి. అంతేకాకుండా చర్మంపై మంట తగ్గుతుంది.