Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందుగా రెండుకాళ్లు ముందుకు చాపి రెండు చేతులు నడుముకు ఇరువైపుల పెట్టి దండాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు నెమ్మదిగా కుడికాలు పాదాన్ని ఎడమ తొడకి ఆన్చాలి. ఇప్పుడు కుడికాలి సైడ్‌కి స్ట్రెచ్ చేసుకోవాలి. కుడిచేత్తో కుడిపాదం బొటనవేలును పట్టుకుని మోచేయి కింద పెట్టాలి. ఇప్పుడు ఎడమచేయి చెవిపైన నుంచి స్ట్రెట్ చేస్తూ కుడికాలి బొటన వేలును పట్టుకోవాలి.
ఉపయోగాలు..
- శరీరాకృతి మెరుగవుతుంది.
- వెన్నెముక బాగా సాగి టోన్ అవుతుంది.
- కాలేయం, పాన్‌క్రియాస్ పనితీరు మెరుగవుతుంది.
- పొట్ట, తొడలలో పేరుకున్న కొవ్వు తగ్గుతుంది.
- జీర్ణక్రియ మెరుగై, పొట్టలో అంతర్గత అవయవాలకు మంచి మసాజ్ అవుతుంది.
జాగ్రత్తలు..
- పొట్ట, వెన్నెముక, కాళ్లకు సర్జరీలు అయినవారు ఈ ఆసనం వేయవద్దు.
- నడుము నొప్పితో బాధపడేవారు ఈ ఆసనం సాధన చేయవద్దు.
- భుజాలకి సర్జరీలు అయినవారు కూడా ఆసనం వేయవద్దు.