Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బట్టలు వాషింగ్ మెషీన్లో వేసేటప్పుడు మిషన్‌పై బట్టలకు సంబంధించి ఉన్న సింబల్స్‌ను జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే బట్టల్లో ఎన్నో రకాల ఫ్యాబ్రిక్‌లు ఉంటాయి. ఏ రకం ఫ్యాబ్రిక్‌ని ఏ టెంపరేచర్లో ఉతకాలి అన్న విషయాలను గమనించాలి. ఉదాహరణకు సిల్కు, వులెన్ ఫ్యాబ్రిక్స్లాంటి వాటిని ఎక్కువ టెంపరేచర్ లో ఉతికితే అవి ముడుచుకుపోయినట్టు అవుతాయి.
వాషింగ్ మెషీన్‌లోని రకరకాల సెట్టింగ్స్‌ని కూడా జాగ్రత్తగా వాడాలి. ఉదాహరణకు కొన్ని రకాల సిల్కు బట్టలకు, ఎంబ్రాయిడరీ బట్టలకు రెగ్యులర్ స్పిన్ సైకిల్ ఉపయోగిస్తే బట్టలు పాడయ్యే ప్రమాదం ఉంది.
బట్టలు ఉతకడానికి బ్లీచింగ్ పౌడర్ ఉప యోగించేవాళ్లు వాషింగ్ మెషీన్ మీద ఉన్న హెచ్చరికలను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకోవాలి. బ్లీచింగ్లోని కెమికల్స్ వల్ల బట్టలు పాడయ్యే ప్రమాదం ఉంది.
బట్టలు వాషింగ్ మెషీన్లో వేసేటప్పుడు వాటిని సిల్కు, కాటన్, వులెన్ అని గ్రూపు లుగా విడగొట్టి వేయాలి. ఇలా చేస్తే ఫ్యాబ్రిక్స్‌కి తగ్గట్టు డిటర్జెంట్ పౌడర్ ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఉతికే బట్టలను బట్టి టెంపరేచర్స్ను కూడా సెట్ చేసుకోవచ్చు.
బట్టలను డ్రయ్యర్లో వేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అన్ని రకాల బట్టలనూ డ్రైయ్యర్‌లో వేయకూడదు. ముఖ్యంగా వులెన్, సిల్కు వంటి బట్టలను డ్రయ్యర్లో వేస్తే పాడవుతాయి.
ముదురు రంగు ఉన్న బట్టలను వాషింగ్ మెషీన్ లో విడిగా వేసి ఉతకాలి. లేకపోతే మిగతా బట్టలకు వాటి రంగు అంటుకునే ప్రమాదం ఉంది.
పరిమితికి మించి బట్టలను వాషింగ్ మిషన్‌లో వేసి ఉతకడానికి ప్రయత్నించ కండి. ఓవర్‌లోడ్ వల్ల మెషిన్ డ్రమ్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల బట్టలు ఉతికే స్పిన్నింగ్ సైకిల్ కూడా దెబ్బతింటుంది.