Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందుగా వజ్రాసనంలో కూర్చొవాలి ఇప్పుడు నెమ్మదిగా కుడికాలు ముందుకు తీసుకొని ఎడమకాలు వెనక్కి చాపాలి. రెండు అరచేతులు పాదానికి ఇరువైపులా ఉంచాలి. శరీరాన్ని సమన్వయం చేసుకుంటూ రెండుచేతులు చెవుల వెనక్సి స్ట్రెచ్ చేసుకోవాలి. ఈ స్థితిలో అర నిమిషం పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే విధంగా ఎడమకాలు ముందుకు తీసుకొని కుడికాలు వెనక్కి చాపాలి. ఇలా కాలు మార్చుతూ పదిసార్లు చేయాలి.
ఉపయోగాలు..
- వెన్నెముక బాగా సాగుతుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది.
- శ్వాస సంబంధించిన సమస్యలు అదుపులో ఉంటాయి.
- కాలేయం బాగా టోన్ అయ్యి మసాజ్ అవుతుంది
- మూత్రపిండాల పనితీరు మెరుగవుతుంది.
జాగ్రత్తలు..
- మోకాళ్లనొప్పులతో బాధపడుతున్న వారు, మోకాలి సర్జరీలు అయినవారు ఈ ఆసనాలు వేయవద్దు
- మెడకి సంబంధించిన సమస్యలు ఉన్నవారు మెడని ఎక్కువగా వెనక్సి వంచవద్దు