Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండలు మండిపోతున్నాయి. శరీరం వడలిపోతోంది. ఉపశమనం కోసం కీరా షర్బత్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందామా...
కావాల్సినవి
కీర దోసకాయ రసం: అరగ్లాస్
మంచినీళ్లు: ఒక గ్లాస్
నిమ్మకాయ: ఒకటి
చక్కెర: తగినంత
ఉప్పు: చిటికెడు
మిరియాలపొడి: చిటికెడు
పుదీనా ఆకులు కొన్ని
తయారు చేసే విధానం
మంచినీటిలో కీరా రసం కలిపిన తర్వాత నిమ్మకాయ రసం పిండాలి. దానిలో చక్కెర, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. పైనుంచి సన్నగా తరిగిన పుదీనా ఆకులను వేసుకుని తాగాలి.