Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పని ఒత్తిడో లేక మరేదో కారణంతోనే ఆలుమగల మధ్య సంబంధాలలో యాంత్రికత పెరిగిపోతోంది. నిజానికి ఒకరికొకరు సన్నిహితంగా మెలగాలనే ఆలోచన మనసు మూలల్లో ఉన్నా వివిధ కారణాలను సాకుగా చూపించుకుంటూ జీవితం సాగిస్తుంటారు. ఫలితంగా జీవితం నిస్సారంగా మారిపోతుంది. నిజానికి భార్యాభర్తల మధ్య బంధం కేవలం పడకగదికే పరిమితం కాదు. ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమాభి మానాలూ ప్రభావం చూపిస్తాయన్న సంగతి మర్చిపోవద్దు.
- భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తుంటే వచ్చే వారాంతపు సెలవుని విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించు కోవాలను కుంటారు. నిజమే... అయితే దాన్ని ఆలుమగలు ఇద్దరూ కలిసి ప్రయత్నించండి. అంటే వీలైతే సాయంత్రం నాలుగింటికే ఇద్దరూ కలిసి దగ్గర్లో ఉన్న పార్కుకెళ్లి కాసేపు సేదతీరండి. ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోవడం వల్ల నిద్ర ముంచుకొస్తుంది. వివిధ పనులూ గుర్తొస్తాయి. అలాకాకుండా చేసే ఈ ప్రయత్నం మీ మెదడుని తేలిక పరుస్తుంది. ఒకరికొకరు మనసువిప్పి కబుర్లు చెప్పుకునేందుకు ఈ సమయం ఉపయోగపడుతుంది.
- ఇద్దరరూ వేర్వేరు పనివేళల్లో విధులకు వెళ్తారు. కనీసం ఇంటికొచ్చాక కూడా పనిచేసే ఓపిక ఉండదు. ఇలాంటప్పుడు 'సాయం చేయలేదు, పనులు పూర్తి చేయలేదు' అంటూ ఒకరిపై ఒకరు నెపం వేసుకునే తీరుకి దూరంగా ఉండండి. ఇద్దరూ ఇంటి బాధ్యతల్ని సమంగా పంచుకునే ప్రయత్నం చేయండి.
- ఒకవేళ ఎవరైనా ఒకరోజు ఆ పనిని పూర్తి చేయలేక పోయినా 'నీకు బాగోలేదు కదా, విశ్రాంతి తీసుకో. సాయంత్రం వచ్చాక దాన్ని పూర్తి చేస్తా' అంటూ మీరిచ్చే భరోసా చాలు వారికి మీమీద ఉన్న ప్రేమ అర్థం కావడానికి.
- రోజంతా పని ఒత్తడితో అలసటతో సతమతమవుతూ మీరుంటే .. భాగస్వామికేమో కనీసం ఒక్కసారైనా నేను గుర్తురాలేదా అనిపిస్తుంది. ఇద్దరి వాదనా నిజమే కానీ మీరే పనిలో ఉన్నా ఒక సెకను ఖాళీ చేసుకుని మీ పరిస్థితి అవతలి వారికి తెలియచెస్తే అర్థం చేసుకోగలుగుతారు. మాట్లాడ లేకపోయినా 'తిన్నావా' అని అడిగే చిన్న సందేశం చాలు అవతలివారిలో అభద్రతా భావాన్ని తగ్గించడానికి. ఇదే పరిస్థితి మీకూ ఉంటే ప్రయత్నించి చూడండి.
- ఆఫీసులో ఇబ్బందులు కావొచ్చు, కుటుంబ సమస్యలు కావొచ్చు ఇద్దరిలో ఒకరు సతమత మవుతుంటే మాత్రం వాటిని మాటిమాటికీ ప్రస్తావిస్తూ ఇబ్బంది కలిగించొద్దు. తప్పెవరిది అయినా దాన్ని సానుకూలంగా అర్థమయ్యేలా చెప్పడమే మేలు. లేదంటే తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదంటూ అభద్రతకు గురవుతుంఆరు. వాటిని ఎలా సరిదిద్దుకోవచ్చే వీలైతే సలహా ఇవ్వండి.