Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమంది భార్యాభర్తలు ఇతరుల ముందు ఒకరిగురించి ఒకరు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. తమ ఆధిక్యతను చాటుకోవడానికి అం టారో లేక తెలియక అంటారో గానీ ఎదుటివారి ముందు తన జీవిత భాగస్వామిని తక్కువ చేస్తున్నామనే భావన వారిలో వుండదు.
ఙ భార్యగానీ, భర్తగానీ తమ ఆధిక్యతను ప్రదర్శించే సమయంలో ఏదో ఒకటి నోరుజారి అనేస్తూ వుంటారు. ఇతరుల వద్ద తమ జీవిత భాగస్వామి గుణగణాల గురించి, బలహీనతల గురించి.. తక్కువ చేసి చెప్పినం దువల్ల... ఇతరుల దష్టిలో.. తన జీవిత భాగస్వామి ఎంత లోకువ అవుతారో అర్థం చేసుకోరు.
- ఆలుమగలు తమ గౌరవ మర్యాదలను పరస్పరం కాపాడుకోవాలంటే ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి లోపాలను ఒకరు ఏకాంతంలో సరిదిద్దుకోవాలి. భార్యాభర్తలన్నాక పాలూ నీళ్ళలా కలిసిపోవాలి. ఒకరి లోపాలను మరొకరు ఇతరుల ముందు ఎత్తిచూపడం, తక్కువ చేసి మాట్లాడటం సరికాదు. ఒక్కోసారి ఇలాంటి మాటలు జీవిత భాగస్వామి మనసుని గాయపరచి, సంసారాల్లో కల్లోలాలు సష్టించే వీలుంది.
- చిన్న చిన్న మాటలే చినికి చినికి గాలివానగా మారి, దాంపత్య బంధంలో తుపాన్లు సష్టించే ప్రమాదం వుంది. భర్తలో కొన్ని విషయాలు నచ్చకపోతే గోరంతలు కొండంతలు చేసి పొరుగువారికి భార్య ఆ విషయాలు చెప్పటం గానీ, అలాగే భార్య గురించి నలుగురిలో వ్యంగ్యంగా భర్త మాట్లాడటం గానీ మంచిది కాదు.