Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్మార్ట్‌ఫోన్స్ వాడకం పెరిగేకొద్దీ ఆన్లైన్ షాపింగ్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉంది. అయితే దుకాణదారులు ఇచ్చే ఆఫర్స్‌కు అట్రాక్ట్ అయి షాపింగ్ చేసేముందు కొన్ని జాగ్రత్తలు పాటించండి.
ఒకప్పుడు ఖాళీగా ఉంటే సినిమాలు, క్రీడలకు సంబంధించిన విషయాల్ని నెట్లో వెతికేవారు. అయితే ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ ఆఫర్స్‌ను చూసే వారి సంఖ్య నానాటికీ అధికమవుతోంది.
పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే దుస్తులు, ఎలక్టాన్రిక్స్, గాడ్జెట్స్‌కు సం బంధించిన ఆఫర్స్‌ను ప్రతిరోజూ చూస్తూ.. చూస్తూ ఏదోరోజు షాపింగ్ చేస్తారు. షాపింగ్ చేయటం తప్పు కాదు కానీ మార్కెట్లో దాని విలువ ఎంతో తెలిసి ఉండి, ఇంట్లో ఖచ్చితంగా ఆ వస్తువు అవసరం ఉందనుకుంటేనే ఆర్డర్ చేయాలి. అంతేకానీ ఆఫర్లు ఉన్నాయని అనవసరంగా కొంటే మీ డెబిట్‌కార్డుకు చిల్లు పడినట్లే.
చాలామంది దుస్తులు, బెడ్‌షీట్స్, ప్లాస్టిక్ వస్తువులు లాంటివి ఆన్లైన్లో అందంగా కనిపించగానే వెంటనే కొంటారు. క్వాలిటీ ఎలా ఉందో తెలీని వస్తువుల్ని కొనటం మంచిది కాదు.
గాడ్జెట్స్‌కు ఎడిక్టయినవారు.. తాము కొనాల్సిన డ్రీమ్ ఫోన్ అతి తక్కువ ధరకు వస్తుందనగానే వెంటనే కొనేస్తారు. ప్రభుత్వ వెబ్‌సైట్స్ పేరుతోనే ఫేక్ వెబ్‌సైట్స్ వస్తున్న ఈ రోజుల్లో ఫేక్ ఆన్లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ ఉండవని గ్యారెంటీ లేదు. అందుకే కొనేముందు వెబ్‌సైట్‌తో పాటు ప్రొడక్ట్ విషయాలు బాగా చదవాలి.
ఎలక్ట్రానిక్ వస్తువులైతే.. ఆన్లైన్ వెబ్సైట్ ఇచ్చిన పరిమిత గడువు తర్వాత ఏవైనా సమస్యలు ఎదురైతే ఆ ప్రొడక్ట్‌కు సంబంధించిన సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో లేదో గమనించాలి. మొత్తానికి ఏ వస్తువును కొనాలనుకున్నా పేరున్న ఆన్లైన్ అంగడిలోనే కొనండి.. అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్నే ఎంచుకోవటం ఉత్తమం.