Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మనయ్యానని ఆనందమా
ఎందుకమ్మనని ఆవేదనా
ఏం చెప్పను ?
మాత త్వం మాధుర్యం
కనుచూపు మేర కనబడుతుందా ?
ఆడపిల్లలపై అవహేళనలు
అత్యాచారాలు, ఆసిడ్ దాడులు
వేధింపులు వెకిలి చేష్టలు
ఏ అమ్మయినా భరిస్తుందా !
ముద్దుగా పెంచిన చిట్టితల్లిని
కొట్టి కొట్టి తరిమేస్తే
కన్నపేగు మమకారం
విలవిలలాడదూ !
ఎత్తుకెళ్ళి రొచ్చు చేసి
పిప్పి చేసిన ఆసిఫా తల్లైతే
తల్లినయినందుకు తల్లడిల్లదూ !
బస్సులో రాక్షస క్రీడకు
బలయిన నిర్భయ తల్లైతే
నిప్పులు కక్కదూ !
జన్మనిచ్చిన కన్నతల్లి
పక్కలో పసికూనను ఎత్తుకెళ్ళే
వారిపై ఆ తల్లి ఉమ్మేయదూ !
మాయమాటలతో మోసం చేసి
వాడుకుని విసిరేసిన
బిడ్డలతల్లి భగ్గుమనదూ !
ఈ తల్లుల చిప్పిల్లిన రక్తాశ్రువులు
ప్రశ్నిస్తున్నారు మాత దినోత్సవాన్ని
మేమేం పాపం చేసామని ?
మానవత్వానికి ఎసరుపెట్టి
అమ్మతనాన్ని అసహ్యించుకునేలా చేసే
మాత త్వమా ..మా కొద్దు
దేశం కోసం ప్రాణాలడ్డుపెట్టే
అభినందన్ తల్లిగా
మాత్రమే మమ్మల్ని మిగలనీరు
అమ్మంటే ఆప్యాయత
ప్రేమ, అనురాగం, వాత్సల్యం
ఆనాడు ఈనాడు ఏనాడు
అమ్మని పూజించకు
అమ్మని ప్రేమించకు
అమ్మేగా ఏమనుకోదు
మాత దినోత్సవం రోజు
అమ్మల్ని తలుచుకునే వారికో మాట
అమ్మ పనియంత్రం కాదు
అమ్మ ఆట వస్తువూ కాదు
అమ్మ అమ్మ మాత్రమే కాదు
అమ్మ కూడా ఓ మనిషే
గుర్తిస్తారు కదూ