Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజూ సైక్లింగ్ చేయడం వల్ల ఒంటికి ఎంతో మంచిది. శరీరం మంచి ఫిట్నెస్తో ఉంటుంది. అంతేకాదు దీని వల్ల పొందే ఆరోగ్య ఫలితాలు కూడా ఎన్నో ఉన్నాయి.
- సైక్లింగ్ గుండెకు ఎంతో మంచిది. వారానికి 30 కిలోమీటర్లు సైక్లింగ్ చేయడం వల్ల కరోనరీ జబ్బులు 50 శాతం వరకూ తగ్గుతాయి.
- కండరాలు దఢంగా తయారవుతాయి. ఇది శరీరాన్ని బాగా టోనప్ చేస్తుంది. నిత్యం సైక్లింగ్ చేసే వారిలో బలం ఎక్కువగా ఉంటుంది. జీవక్రియ కూడా బాగా జరుగుతుంది.
సైక్లింగ్ మనిషి జీవనకాలాన్ని పెంచుతుంది.
- గంటసేపు బ్రిస్క్ సైక్లింగ్ని చేస్తే 450 కాలరీల వరకూ కరుగుతాయి. సైక్లింగ్ వల్ల కీళ్లు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా మోకాళ్లు, హిప్స్ జాయింట్లు ఫ్లెక్సిబుల్ అవుతాయి. నిత్యం సైక్లింగ్ చేయడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు.
- డిప్రెషన్లాంటివాటి బారిన పడకుండా ఉపయోగపడుతుంది. వీటితోపాటు సైక్లింగ్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.