Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిక్సీ, అవెన్, ఫ్రిజ్ ... వంటి ఎలక్ట్రా నిక్ వస్తువులపై భాగం జిడ్డుగా మారు తుంటుంది. ఇలాంటప్పుడు 4 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో టేబుల్ స్పూన్ వెచ్చని నీళ్లు కలిపి స్పాంజ్‌తో ముంచి, పిండి తుడవాలి. మురికి సులువుగా వదిలిపోతుంది.
- షూస్, స్నీకర్స్ లోపలివైపు దుర్వాసన వస్తుంటుంది. కొద్దిగా బేకింగ్ సోడా లోపలివైపు చల్లి, తడి క్లాత్‌తో తుడిస్తే దుర్వాసన రాదు.
- చెక్క ఫర్నీచర్ మీద మరకలు తొలగించాలంటే టూత్‌పేస్ట్ రాసి తర్వాత తడి క్లాత్‌తో తుడవాలి.
- పిల్లలు కలర్ పెన్సిళ్లతో గోడల మీద బొమ్మలు వేస్తుంటారు. ఈ మరకలు తొలగించాలంటే బేకింగ్ సోడా చల్లి, తరువాత స్పాంజ్‌తో తుడవాలి.
- నీళ్లలో కప్పు అమ్మోనియా కలిపి మెత్తని టర్కీ టవల్స్‌ను నానబెట్టాలి. అరగంట తర్వాత ఉతికితే మురికిపోతుంది. వేడినీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం, చెంచా వంటసోడా, చిటికెడు ఉప్పువేసి వాటర్ బాటిల్స్‌ను రెండు రోజులకొకసారి శుభ్రపరిస్తే బాక్టీరియా దరిచేరదు.