Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందుగా శవాసనం వేయాలి. తరువాత రెండుకాళ్ళను మడిచి నడుమును పైకి లేపాలి. తర్వాత రెండు చేతులను నడుము కింది భాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఉంచాలి. ఇప్పుడు కాళ్ళను ఒకదాని తర్వాత మరొకటి ముందుకు చాచి కాలివేళ్ళను, పాదాన్ని నేలకు తగిలేలా ఉంచాలి. ఈ స్థితిలో 30సెకన్ల పాటు ఉండి తిరిగి శవాసనంలోకి రావాలి. కాస్త రిలాక్స్ అయిన తర్వాత మరోసారి రిపీట్ చేయాలి. ఈ విధంగా మూడు నుంచి ఐదుసార్లు చేయాల్సి ఉంటుంది.
ఉపయోగాలు..
- థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగవుతుంది. - ముఖకాంతి పెరుగుతుంది
- నడుము బలపడుతుంది
- కాలి కండరాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
- ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది.
జాగ్రత్తలు
- మెడ నొప్పితో బాధపడుతున్నవారు, అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు ఈ ఆసనం వేయవద్దు