Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పప్పు ధాన్యాలు ప్రొటీన్లకు పెద్ద నిధులు. ఇవి వ్యాధి నిరోధకశక్తిని పెంచడంతో పాటు కండరాల పటుత్వాన్ని కూడా నిలబెడతాయి. మాంసం, చేపల వంటి వాటిలో ప్రొటీన్లు ఎక్కువే ఉండవచ్చు కానీ, వీటిలో కొలెస్ట్రాల్, గడ్డకట్టే కొవ్వు పదార్థాల నిలువలు కూడా ఎక్కువే. అదే మొక్కల నుంచి వచ్చే ప్రొటీన్లలో అయితే, వాటి నిల్వలు చాలా తక్కువ. పైగా మాంసపదార్థాలతో పోలిస్తే పప్పు ధాన్యాల ధర కూడా తక్కువే. వీటిలో శరీర పోషణకు అవసరమైన పొటాషియం, కాల్షియం, ఫైబర్ సమద్ధిగా ఉండడం వల్ల ఇవి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. ఇవే కాకుండా ఎముకలు గుళ్ల బారే ఆస్టియోపొరోసిస్, స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి.
- పెసర్లు, బబ్బర్లు, రాజ్మా, బఠాణీ, శనగలు, పల్లీలు, చిక్కుడు గింజలు, వీటితో పాటు బాదాం, పిస్తా, జీడిపప్పు ఇవన్నీ శరీర అవసరాలకు సరిపోయే పోషకాలన్నిటికీ వరం లాంటివి. వీటిని ఉడికించి తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.
- పప్పు ధాన్యాలు బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతాయి. పప్పు ధాన్యాల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఒక కప్పు ధాన్యం తినడంతోనే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇలా ఎక్కువగా తినలేక పోవడం వల్ల బరువు తగ్గడానికి ఇవి తోడ్పడతాయి.
- ఈ ధాన్యాల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫలితంగా ఆకలి తొందరగా తగ్గిపోయి చిరుతిళ్ల మీదికి గానీ, మరే పదార్థాల మీదికి గానీ మనసు వెళ్లదు. వీటిని తరుచూ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ 5 శాతం దాకా తగ్గిపోయి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. చాలా మంది
- వద్ధుల్లో జింక్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, కాపర్, సెలీనియం లోపాలు ఉంటాయి. వీటన్నింటినీ పప్పు ధాన్యాలు పూరిస్తాయి. మాంసంతో పోలిస్తే, వీటికి సులభంగా జీర్ణమయ్యే లక్షణం ఉండడం వల్ల అన్ని వయసులవారికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.