Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవిలో ముఖం, చేతులపై చర్మం కందిపోకుండా కాపాడు కోవాలంటే... కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటో చూడండి..
ఎండాకాలంలో ముఖం జిడ్డుగా మారుతుంది. దీని వల్ల ముఖం మీద దుమ్ము ధూళి పడి పాడైపోయే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అవసరం అనుకుంటే సోపు వాడవచ్చు. లేదంటే ఫేస్‌వాష్ లోషన్లు, క్రీములు వాడొచ్చు.
ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు ప్రతి అరగంట కొకసారి సన్‌స్క్రీన్ లోషన్లను ముఖానికి రాసుకోవాలి. లేకపోతే వేసవి వేడి వల్ల చర్మం దెబ్బతింటుంది. ఒక్కోసారి చర్మక్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు.
ఒక్కోసారి మిట్టమధ్యాహ్నం బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో ఎస్పిఎఫ్ 60 సన్‌బ్లాక్ క్రీముల్ని వెంటబెట్టుకు వెళ్లాలి. ముఖ్యంగా సమ్మర్లో ఎక్కువగా స్విమ్మింగ్ చేసేవాళ్లకు ఇది తప్పనిసరి.
వేసవిలో స్ట్రాంగ్ షాంపూలను వాడొద్దు. అందులోని రసాయనాలకు వేసవి వేడి కూడా తోడవ్వడం వల్ల జుట్టుకు హాని కలుగుతుంది. అందుకని ఈ సీజన్లో మైల్డ్ షాంపూలను ఉపయోగిస్తేనే మంచిది.