Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్యకాలంలో వంటగదిలో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటు న్నాయి. ముఖ్యంగా సిలిండర్ జాగ్రత్తగా వాడకపోవడం వల్ల. మరి గ్యాస్ సిలిండర్ వాడే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
- వంట చేసేందుకు తయారయ్యే ముందు గ్యాస్ స్టవ్ పరిస్థితిని ఒక్కసారి జాగ్రత్తగా గమనించాలి.
- వంట చేసే గదిలో గాలి..వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి.
- లీక్ అవుతుంటే వెంటనే అప్రమత్తమవ్వాలి. గ్యాస్ కంపెనీ అత్యవసర ఫోన్ నెంబర్కు సమాచారం అందచేయాలి.
- గ్యాస్ లీకయిన సందర్భంలో సేఫ్టీపిన్ బిగించి ఖాళీ ప్రదేశంలో సిలిండర్ ఉంచేయాలి.
- వంట గది తలుపు కింద కనీసం అర అంగుళం ఖాళీ ఉండేలా చూడాలి.
- గ్యాస్ స్టవ్...రిఫ్రిజిరేటర్..ఒకే చోట ఉండకుండా చూడాలి.
- ఉపయోగించలేని సమయంలో రెగ్యులేటర్ని బంద్ చేయాలి
- వంట చేసే సమయంలో గిన్నె నుండి మంట వస్తే వెంటనే దానిపై మూత పెట్టేసి బర్నర్ బంద్ చేయాలి.
- గ్యాస్ సిలిండర్ దగ్గర మంట త్వరగా అంటుకొనే స్వభావం కలిగిన వస్తువులు ఉంచకూడదు.
- గ్యాస్ స్టవ్ ట్యూబ్స్ తరచూ మారుస్తుండాలి. ట్యూబ్స్..రెగ్యులరేటర్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.