Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవిలో చెమట పొక్కుల బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో చిరాగ్గా అనిపిస్తుంటుంది. వాటి నుంచి బయటపడి చర్మాన్ని సంరక్షించుకోవాలంటే ఇలా చేసి చూడండి.
- టీట్రీ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. చెమట పొక్కులు విపరీతంగా వేధించినప్పుడు టీట్రీ ఆయిల్‌ని నీళ్లలో కలిపి అందులో దూదిని ముంచాలి. ఆ దూదిని కాసేపయ్యాక తీసుకుని చెమటపొక్కుల మీద తుడవాలి. చేతులతో నూనె రాయడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. అలాకాకుండా దూదితో రాస్తే సమస్య త్వరగా తగ్గుతుంది.
చెమట పొక్కులు వచ్చిన ప్రాంతంలో కలబంద గుజ్జును రాయాలి. దీనిలో యాస్ట్రింజెంట్ గుణాలు అధికం. చెమట పొక్కుల్నే కాదు.. కొన్నిరకాల ఇన్ఫెక్షన్లను ఆ గుణాలు దూరం చేస్తాయి. శరీరంలో వేడిని బయటకు పంపి చల్లదనాన్నిస్తుంది కలబంద. ఈ గుజ్జుకు పసుపు కలిపినా మరింత ప్రయోజనం ఉంటుంది.
- ఈ సమస్యకు కోల్డ్ కంప్రెసర్ చికిత్స బాగా ఉపయోగపడుతుంది. నీటిని ట్రేలో నింపి డీప్‌ఫ్రిజ్‌లో ఉంచాలి. తరవాత తయారైన ఐసుముక్కల్ని మెత్తని వస్త్రంలోకి తీసుకుని.. చెమట పొక్కుల మీద నెమ్మదిగా నొక్కినట్లు చేయాలి. మూడు నాలుగు గంటలకోసారి ఇలా చేయడం వల్ల పొక్కులు త్వరగా తగ్గిపోతాయి. వాటివల్ల వచ్చే నొప్పీ, మంటా కూడా అదుపులో ఉంటాయి.
- కొన్నిసార్లు పొక్కుల వల్ల మంట కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు వెనిగర్ చక్కటి పరిష్కారం అందిస్తుంది. వ్కెట్ వెనిగర్‌లో టిష్యూ కాగితాన్ని ముంచి చెమట పొక్కుల మీద పరవాలి. కాగితం నుంచి వెనిగర్‌ను చర్మం గ్రహించాక తీసేయాలి. ఇలా చేయడం వల్ల ఆ సమస్యలు తగ్గడమే కాదు.. ఎంతో హాయిగానూ అనిపిస్తుంది.
- కొన్నిసార్లు చెమట పొక్కులు నొప్పిగా అనిపి స్తాయి. అలాంటప్పుడు లావెండర్ నూనెలో ముంచిన దూదితో ఆ ప్రాంతంలో మర్దన చేస్తున్నట్లు రాయాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే ఉపశమనం కలుగుతుంది. నొప్పీ ఉండదు.
- కొందరికి బ్లాక్ టీ తాగే అలవాటు ఉంటుంది. అలాంటి వారు ఈ టీని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసి.. సమస్య ఉన్నచోట రాస్తే.. చెమట పొక్కుల బెడద తగ్గుతుంది. చర్మం మీద అందుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఉన్నా వెంటనే నశిస్తాయి.