Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాదం పప్పులపై పొట్టు సులువుగా రావాలంటే 15-20 నిమిషాల పాటు వేడి నీటిలోనానబెట్టాలి.
- కొద్దిగా కాలిన గాయాలకు అరటిపండు గుజ్జు రాస్తే మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
- ఫుడ్డింగ్స్, లేదా కేక్స్ తయారుచేసుకునేటప్పుడు గుడ్లు వాసన రాకుండా ఉండాలంటే నిమ్మకాయ తొక్క తురుమును చిటికెడు కలుపుకొంటే సరిపోతుంది.
- నిమ్మకాయలు గట్టిపడితే, అయిదు నిమిషాల పాటు వేడినీటిలో వేసి తీయాలి.
- అన్నం వండే ముందు ఎసరు నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి వండితే అన్నం తెల్లగా అవుతుంది.
- నూడుల్స్‌ను ఉడకబెట్టిన తరువాత వేడినీటిని పూర్తిగా వంపేసి, చన్నీటిని జత చేస్తే విడివిడిగా అవుతాయి.
- కట్‌చేసిన తరువాత వంకాయ ముక్కలను పాలుకలిపిన నీళ్లలో వేస్తే నల్లబడకుండా ఉంటాయి.