Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోజనానికి, డిన్నర్‌కు మధ్య స్నాక్స్ పడకపోతే ఎనర్జీ రాదు. అయితే ఈ స్నాక్స్‌లో అధిక కొవ్వులు ఉండకూడదు. తక్షణమే ఎనర్జీ సమకూరాలి. ఎగ్వైట్తో చేసుకునే అలాంటి కొన్ని స్నాక్స్..
- తక్కువ టైమ్‌లోనే తయారు చేసుకునే స్నాక్స్ అయ్యుండాలి. కాబట్టి పుట్టగొడుగులు, గుడ్డులోని తెల్లసొనలతో కలిపి చక్కటి ఆమ్లెట్ వేసుకోండి. తక్కువ క్యాలరీలతో ఎక్కువ శక్తినిచ్చే స్నాక్ ఇది.
- లేత పుదీనా ఆకులను ఎగ్వైట్లోకి వేసి.. బాగా కలియబెట్టి.. కాస్త ఉప్పు, కారం జోడించి.. ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఇందులోను లో క్యాలరీస్ ఉంటాయి.
- ఎగ్వైట్లోకి ఉడికించిన పచ్చి బఠానీలు, క్యారెట్ వంటి కూర గాయల ముక్కలు కలిపి వేసుకోవచ్చు.
- మార్కెట్లో సులువుగా దొరికే ఆకుకూర పాలకూర. దీన్ని సన్నగా తరిగి.. ఎగ్‌వైట్‌లో కలుపుకుని ఆమ్లెట్ వేసుకోవచ్చు.
- ఒట్టి ఆమ్లెట్ వేసుకుని తింటే ఆకలితీరదు. రెండు మూడు బ్రెడ్ ముక్కల్ని పల్చగా వేడిచేసి.. ఎగ్వైట్తో బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోండి.
- నూనెలేకుండా దోస వేసి.. దాని మీద ఎగ్‌వైట్ వేసుకోవచ్చు. ఇది ఇన్స్టంట్ ఎనర్జీ.
- తక్కువ నూనెతో ఎగ్పరాటాను వేసుకోవచ్చు. అయితే మసాలాలు దట్టించకూడదు. కేవలం ఎగ్వైట్నే తీసుకోవాలి.