Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంట సులువుగా, వేగంగా పూర్తికావాలంటే అందుకు అవసరమైన ఉపకరణాల ఉండాలి. అలాంటి ఉపకరణాలు ఇప్పుడు మార్కెట్లో అందు బాటులో ఉన్నాయి. అలాంటివే కొన్ని ఇవి....
హెర్బ్ సీజర్
ఆకుకూరలు, ఉల్లి ఆకులు కట్ చేయడానికి హెర్బ్ సీజర్ చక్కగా ఉపయోగపడుతుంది. సులభంగా, వేగంగా కట్ చేసుకోవచ్చు.
కార్న్ జిప్పర్
మొక్కజొన్న కంకులు ఒలవాలంటే చేతులు నొప్పి పుట్టాల్సిందే. టైం కూడా చాలా పడుతుంది. అయితే కార్న్ జిప్పర్ ఉంటే క్షణాల్లో పని అయిపోతుంది.
మల్టీచాపర్
కూరగాయలు కట్ చేయడం పెద్ద పనే. అయితే మల్టీ చాపర్ ఉంటే క్యారట్ నుంచి ఉల్లిపాయ వరకు అన్నింటికి చకచకా కట్ చేసుకోవచ్చు. ఉపయోగించడం కూడా చాలా సులువు.
గార్లిక్ పీలర్
అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవాలంటే కనీసం ఒక గంటైనా కష్టపడాలి. వెల్లుల్లి రెబ్బల పొట్టు తీయాలంటే వేళ్లన్నీ నొప్పులు పుడతాయి. కానీ గార్నిక్ పీలర్ ఉంటే ఆ ఇబ్బంది ఉండదు. క్షణాల్లో వెల్లుల్లి పొట్టు తొలగించవచ్చు.
ఎగ్క్రాకర్
ఆమ్లెట్ వేసిన ప్రతీసారి చికాకే. ఆమ్లెట్లో కోడిగుడ్డు పెంకులు కూడా వస్తుంటాయి. ఈ ఇబ్బంది దూరం కావాలంటే ఎగ్క్రాకర్ని ఎంచుకోండి.